26లోగా ఓటరు నమోదు పూర్తి చేయాలి
ABN, First Publish Date - 2022-12-15T01:40:56+05:30
ఓటరు నమోదుకు సంబంధించిన ప్రక్రియను డిసెంబరు 26 నాటికి పూర్తి చేయాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ అన్నారు.
ఆదిలాబాద్ టౌన్, డిసెంబరు 14: ఓటరు నమోదుకు సంబంధించిన ప్రక్రియను డిసెంబరు 26 నాటికి పూర్తి చేయాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఈఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు నమోదు తదితర దరఖాస్తులకు సంబంధించిన డిజిటలైజ్ ప్రక్రియను ఈనెల 26 నాటికి పూర్తి చేయాలని అన్నారు. జనాభా, ఓటర్ల నిష్పత్తి, జెండర్ నిష్పత్తిపై దృష్టిసారించాలని సూచించారు. అదేవిధంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ఫారం-6 ద్వారా 24,655 డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఈ నెల 26 నాటికి అన్ని రకాల ప్రక్రియ పూర్తిచేయాలని అన్నారు. జనాభా ఆధారంగా ఓటర్ల నిష్పత్తి పెంచాలని ఈఆర్వోలను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ నటరాజ్, బోథ్ ఈఆర్వో వెంకటేశ్వర్లు, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియ, స్వీప్ నోడల్ అధికారి లక్ష్మణ్, తహసీల్దార్ సతీష్, నాయబ్ తహసీల్దార్లు ప్రవీణ్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T01:41:00+05:30 IST