ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయానికి ప్రతీక విజయదశమి

ABN, First Publish Date - 2022-10-05T04:08:02+05:30

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండగను ఘనంగా నిర్వహించుకుంటారు. అందుకే ఈ పండగను విజయ దశమి అంటాం. నూతన దుస్తులు ధరించి వివిధ రకాల పూజలతో పాటు జమ్మి ఆకులతో ప్రతీ ఒక్కరు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం, పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడం ఈ పండగ ప్రత్యేకతలు.

బెల్లంపల్లిలో రావణ ప్రతిమ దహన కార్యక్రమానికి ఏర్పాట్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూర్‌, అక్టోబర్‌ 4: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా  దసరా పండగను ఘనంగా నిర్వహించుకుంటారు. అందుకే ఈ పండగను విజయ దశమి అంటాం. నూతన దుస్తులు ధరించి వివిధ రకాల పూజలతో పాటు జమ్మి ఆకులతో ప్రతీ ఒక్కరు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం, పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడం ఈ పండగ ప్రత్యేకతలు. మరోవైపు శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే ఈ పండగలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు అమ్మవారి నవరాత్రులు నిర్వహించి దశమి రోజున దసరా జరుపుకుంటారు. ఈసారి జిల్లా వ్యాప్తంగా ప్రజలు దసరా పండగను అత్యంత వైభవంగా నిర్వహించుకునేందకు సిద్ధమయ్యారు. దసరా సందర్భంగా 15 రోజుల ముందు నుంచే మార్కెట్లు కళకళలాడాయి. వస్త్ర దుకాణాలు, నగల దుకాణాల్లో కొనుగోళ్ల సందడి బాగా కనిపించింది. 

వివిధ ఆచారాలు

దసరా పండగ వెనుక పురాణాల్లో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. అయితే వీటన్నింటి పరమార్థం మాత్రం ఒకటే. చెడుపై మంచి విజయం సాధించిన రోజుగా పరిగణిస్తాం. రావణుడిపై రాముడు యుద్ధంలో గెలిచిన రోజు, మహిశాసురుడి అంతంతో పాటు అరణ్యవాసం ముగించిన పాండవులు జమ్మి చెట్టుపై ఉంచిన అస్ర్తాలను తిరిగి తీసుకొన్న రోజు.. ఇలా కథలన్నీ విజయానికి ప్రతీకలే.. 

ప్రత్యేకతలు

దసరా రోజున పాలపిట్ట దర్శనం, జమ్మి చెట్టు పూజ, బంధు మిత్రుల ఆశీర్వాదాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ రోజున పాలపిట్ట కనిపిస్తే శుభంగా భావిస్తారు. శమి వృక్షానికి పూజలు నిర్వహించి ఆ ఆకులతో శుభాకాంక్షలు చెప్పుకుంటారు. కొత్త పనులను, కార్యక్రమాలను కూడా ఈ రోజున ప్రారంభిస్తే విజయవంతమవుతాయని నమ్ముతారు. 

జిల్లా వ్యాప్తంగా వేడుకలు

దసరా రోజున రావణ ప్రతిమ దహనం కార్యక్రమాలను వైభవంగా నిర్వహిస్తారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుతారు. మందమర్రి, రామకృష్ణాపూర్‌, మంచిర్యాలతో పాటు ఈసారి బెల్లంపల్లిలోనూ హిందూ ఉత్సవ సమితి వారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు కూడా చేశారు. రావణ దహనంతో పాటు జమ్మి వృక్షాల పూజను ఘనంగా నిర్వహిస్తున్నారు. 

Updated Date - 2022-10-05T04:08:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising