ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్దవాగు అవతలి ఒడ్డున చిక్కుకున్న రైతు

ABN, First Publish Date - 2022-09-28T03:48:45+05:30

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాం మండల కేంద్రంలోని సమీపంలోని పెద్దవాగు అవతలి ఒడ్డుకు చిక్కుకున్న రైతును అధికారులు సురక్షితంగా ఇంటికి చేర్చారు.

రైతును వాగు దాటిస్తున్న గజ ఈతగాళ్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- గజ ఈతగాళ్ల సాయంతో ఇంటికి చేర్చిన అధికారులు 

దహెగాం, సెప్టెంబరు 27: కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాం మండల కేంద్రంలోని సమీపంలోని పెద్దవాగు అవతలి ఒడ్డుకు చిక్కుకున్న రైతును అధికారులు సురక్షితంగా ఇంటికి చేర్చారు.  తుమ్మిడి హనుమంతు అనే రైతు మంగళవారం  వ్యవసాయ పనులు చేయడానికి పెద్దవాగు అవతల ఉన్న తన భూమి వద్దకు చుట్టుపక్కల రైతులతో కలిసి వెళ్లాడు. ఆ సమయంలో వాగులో  నీటి  పాయ స్వల్పంగా మాత్రమే వెళుతున్నది. కాగా సాయంత్రానికి పైనుం చి వరద రావడంతో వాగులో ఉధృతి పెరిగింది. గమనించిన  అవత లివైపు ఉన్న రైతులు వాగు దాటి ఇవతలి వైపునకు చేరుకున్నారు. తుమ్మిడి హనుమంతు మాత్రం అవతలి వైపే ఉండిపోయాడు. దీంతో ఇవతలి వైపు వచ్చిన రైతులు అధికారులకు, కుటుంబీకులకు, గ్రామస్థులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. పోలీసులు, గ్రామస్థులు పెద్దవాగు వద్దకు చేరుకున్నారు. ఇద్దరు గజ ఈతగాళ్ల అవతలి వైపు వెళ్లి హనుమంతును ఒక మొద్దపై కూర్చొబెట్టి వారు ఈదుతూ కట్టెను ముందుకు తోస్తూ ఇవతలి ఒడ్డుకు చేర్చారు. 

Updated Date - 2022-09-28T03:48:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising