ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిషన్‌ ఇంద్రధనుస్సులో పిల్లలకు టీకాలు

ABN, First Publish Date - 2022-04-04T06:20:44+05:30

మిషన్‌ ఇంద్రధనుస్సు ద్వారా టీకాలు తీసుకోని పి ల్లలకు సోమవారం నుండి టీకాలు అందించే కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా వైద్య అధికారి డాక్టర్‌ ధనరాజ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేటి నుండి రెండో విడత ప్రారంభం 

జిల్లా వైద్య అధికారి ధనరాజ్‌

నిర్మల్‌ కల్చరల్‌, ఏప్రిల్‌ 3 : మిషన్‌ ఇంద్రధనుస్సు ద్వారా టీకాలు తీసుకోని పి ల్లలకు సోమవారం నుండి టీకాలు అందించే కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా వైద్య అధికారి డాక్టర్‌ ధనరాజ్‌ తెలిపారు. ఆదివారం ఆయన విడుదల చేసిన ప్రకట నలో గత నెల 7 నుంచి వారం రోజులు మిషన్‌ ఇంద్రధనుస్సు కార్యక్రమం నిర్వహించి టీకాలు అందజేస్తామని అన్నారు. కొవిడ్‌ మహమ్మారి వల్లగానీ, మరే ఇతర కారణాల వల్ల సరైన సమయంలో టీకాలు తీసుకోని పిల్లలకు నేటి నుండి టీకాలు వేయనున్నట్లు వివరించారు. ఈనెల 4 నుంచి వారంరోజుల పాటు మిషన్‌ ఇంద్రధనుస్సు నిర్వహిస్తున్నామన్నారు. పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి టీకాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. 12 రకాల వ్యాధులు సోకకుండా టీకాపని చేస్తుందన్నారు. కోరింతదగ్గు, డిప్తీరియా, ధను ర్వాతం,పోలియో,క్షయ,తట్టు తదితర వ్యాధులు రాకుండా పిల్లలను కాపాడుతా యని అన్నారు. మొదటి విడతలో 1919 మంది పిల్లలకు టీకాలు వేశామని తెలిపారు. రెండోవిడతలో 664 మందిని గుర్తించామన్నారు. టీకా తీసుకొనేవారు ఈ అవకాశం ఉపయోగించుకోవాలన్నారు. 

Updated Date - 2022-04-04T06:20:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising