ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పౌష్టికాహారం అందకనే విద్యార్థులకు అస్వస్థత : ఎంపీ

ABN, First Publish Date - 2022-08-17T05:56:19+05:30

ప్రభుత్వ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో చ దువుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం సరైన విధంగా పౌష్టికాహారం అంద జేయక విద్యార్థులు కలుషిత ఆహారం తింటూ అస్వస్థతకు గురవుతున్నారని ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉట్నూర్‌, ఆగస్టు 16 : ప్రభుత్వ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో చ దువుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం సరైన విధంగా పౌష్టికాహారం అంద జేయక విద్యార్థులు కలుషిత ఆహారం తింటూ అస్వస్థతకు గురవుతున్నారని ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసి ఆస్పత్రి పరిసరాలను పరిశీలించిన అనంతరం డాక్టర్‌ మహేందర్‌తో మాట్లాడి ఆస్పత్రిలో విధులు  నిర్వహిస్తున్న డాక్టర్ల వివరాల ను, రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఈ సం దర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 600 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆస్వస్థతకు గురైనట్లు గుర్తించిందని, కేవలం ఆదిలాబాద్‌ జిల్లాలోనే 280 మంది అస్వస్థత కు గురయ్యారన్నారు. సన్న బియ్యం అందిస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభు త్వం పౌష్టికాహారం అందించలేక పోతోందని విమర్శించారు. ఇటీవల బాసర ట్రిపుల్‌ ఐటీలో 300 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆస్వస్థతకు గురయ్యారని అన్నారు. నార్నూర్‌ ఆస్పత్రితో పాటు ఏజెన్సీలోని పీహెచ్‌సీలలో డాక్టర్ల కొరత ఉందన్నారు. త్వరలో అన్ని ఆశ్రమ పాఠశాలల్లో కూడా రక్త పరీక్షలు నిర్వహించి విద్యార్థులను రక్త హీనత నుంచి కాపాడే చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఆయన వెంట జిల్లా కార్యదర్శి కోండేరి రమేష్‌, నాయకులు గడ్డం నందిరెడ్డి, రామగిరి వాసు, రాజశేఖర్‌, ఉస్కమల్ల  దేవిదాస్‌, శ్రీకాంత్‌ , బింగి వెంకటేష్‌, కాల్వ రవి, తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-08-17T05:56:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising