ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అకాల వర్షంతో అన్నదాతల ఇబ్బందులు

ABN, First Publish Date - 2022-05-25T03:48:57+05:30

వేమనపల్లి మండలంలో మంగళవారం సాయంత్రం అకాల వర్షం కురియ డంతో అన్నదాతలకు నష్టం వాటిల్లింది. ఒక్కసారిగా గంటపాటు ఉరుములతో వడగండ్ల వర్షం కురిసింది. నీల్వాయి, కేతనపల్లి, వేమనపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. తడుస్తున్న ధాన్యాన్ని కాపాడుకునేం దుకు రైతులు నానా ఇబ్బందులు పడ్డారు.

నీల్వాయిలో ధాన్యం కుప్పల మధ్య నిలిచిన నీటిని తీసివేస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేమనపల్లి, మే 24: వేమనపల్లి మండలంలో మంగళవారం సాయంత్రం అకాల వర్షం కురియ డంతో అన్నదాతలకు నష్టం వాటిల్లింది. ఒక్కసారిగా గంటపాటు ఉరుములతో వడగండ్ల వర్షం కురిసింది. నీల్వాయి, కేతనపల్లి, వేమనపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. తడుస్తున్న ధాన్యాన్ని కాపాడుకునేం దుకు రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. టార్పాలిన్‌ కవర్లు కప్పుతూ తడి సిన ధాన్యాన్ని వేరు చేశారు. ధాన్యం కుప్పల చుట్టూ వర్షం నీరు చేరడంతో నీటిని అంతా బయటకు ఎత్తి పారబోశారు. మండలంలోని నీల్వాయి, కేతనపల్లి, వేమ నపల్లి గ్రామాల్లో వడగళ్ళ వాన సైతం కురిసింది. 

కన్నెపల్లి: కన్నెపల్లి మండలంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. జన్కాపూర్‌ గ్రామానికి చెందిన ఇప్పకొమురయ్య ఇంటి గోడ కూలిపోయింది. పలువురి ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి. రైతులు ధాన్యం కుప్పలు తడవకుండా టార్పాలిన్‌ కప్పారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.  

Updated Date - 2022-05-25T03:48:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising