ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Students protest: అల్పాహారాన్ని బాయ్ కాట్ చేసిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు

ABN, First Publish Date - 2022-07-31T16:13:40+05:30

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల (Students) ఆందోళన (protest) కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ (Basara Triple IT)లో విద్యార్థుల (Students) ఆందోళన (protest) కొనసాగుతోంది. ఆదివారం ఉదయం అల్పాహారాన్ని విద్యార్థులు బాయ్ కాట్ చేశారు. దీంతో మెస్‌లు బోసి పోతున్నాయి. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఎంపీ బాపురావు వస్తారన్న సమాచారంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకుంటున్నారు. 


నిర్మల్ (Nirmal): బాసర ట్రిపుల్ ఐటీ (Basara Triple IT)లో రాత్రి నుంచి విద్యార్థుల (Students) ఆందోళన (protest) కొనసాగుతోంది. విద్యార్థులతో ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ (VC) వెంకటరమణ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని, టెండరు ప్రక్రియ జరపాల్సి ఉంటుందని వీసీ చెప్పారు. దీంతో కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించే వరకు ఆందోళన విరమించబోమని విద్యార్థులు స్పష్టం చేశారు. ఉదయం అల్పాహారం కూడా బాయ్ కాట్ చేస్తున్నట్టు విద్యార్థులు వెల్లడించారు. శనివారం రాత్రి నుంచి మెస్‌లోనే బైఠాయించారు.


బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల మళ్లీ ఆందోళనకు దిగారు. శనివారం రాత్రి భోజనం బహిష్కరించి నిరసన తెలిపారు. ఇంజనీరింగ్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం చదివే 3 వేల మంది విద్యార్థులు డైనింగ్‌ హాల్‌లోనే బైఠాయించారు. హాస్టళ్లలో భోజనం మెరుగుపడలేదని డిమాండ్‌ చేస్తూ ఈ ఆందోళనకు దిగినట్లు విద్యార్థులు తెలిపారు. ప్రతిరోజూ వర్సిటీ అధికారులు, అధ్యాపకులు విద్యార్థులతో ఏర్పాటు చేసిన కమిటీ ప్రతిరోజు మెస్సుల్లో భోజన వసతిని పరిశీలిస్తున్నప్పటికీ ఎలాంటి మార్పు లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. క్వాలిటీ పెంచాలని అదేవిధంగా ప్రతీరోజు మధ్యాహ్నం భోజనంలో అందించే అరటిపండు స్థానంలో ఆపిల్‌ లేదా ఆరెంజు పండు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. న్యూట్రిషన్‌తో కూడిన ఆహారం పెట్టాలని కోరుతున్నారు.

Updated Date - 2022-07-31T16:13:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising