ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పండుగ పూట విషాదం

ABN, First Publish Date - 2022-03-02T03:34:14+05:30

సిర్పూర్‌(టి) మండలం లోనవెల్లి గ్రామం లో మహాశివరాత్రి పర్వదినం రోజు పెన్‌గంగలో పుణ్యస్నానాలకు వెళ్లి తల్లీకొడుకు మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది.

రక్షిత్‌ మృతదేహాన్ని తీసుకు వస్తున్న ఈతగాళ్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పెన్‌గంగలో పుణ్యస్నానాలకు వెళ్లి తల్లీకొడుకు మృతి
సిర్పూర్‌(టి), మార్చి 1: సిర్పూర్‌(టి) మండలం లోనవెల్లి గ్రామం లో మహాశివరాత్రి పర్వదినం రోజు పెన్‌గంగలో పుణ్యస్నానాలకు వెళ్లి తల్లీకొడుకు మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. లోనవెల్లి గ్రామానికి చెందిన ఏరుకొండ పద్మ(35), ఆమె కుమారుడు ఏరుకొండ రక్షిత్‌(14), పద్మ చెల్లులు సరిత మహాశివరాత్రిని పురస్క రించుకుని గ్రామానికి సమీపంలోని పెన్‌గంగ(వార్ధానది)లో పుణ్యస్నా నాలు ఆచ రించడానికి వెళ్లారు. స్నానాలు చేస్తుండగా రక్షిత్‌, పద్మ నీటిలో ముని గి పోయారు.  సరితతో పాటు అక్కడే ఉన్న కౌటాల మండలానికి చెందిన 108 అంబులెన్స్‌ డ్రైవర్‌ సుభాష్‌ బాపురావు వీరిని రక్షించేం దుకు యత్నించారు. అప్పటికే వారు నీటిలో మునిగి పోయారు. విషయం తెలుసుకున్న ఎస్సై రవికుమార్‌ అక్కడికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టారు. మూడు గంటల తరువాత మృతదేహాలు లభ్యమయ్యాయి. డిప్యూటీ తహసీల్దార్‌ తిరుమల సంఘటన స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించారు. మృతురాలి కుటుంబం తమకు ఉన్న రెండెకరాల భూమిని సాగు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నారు. పద్మకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. భార్యతో పాటు పెద్దకొడుకు మృతి చెందడంతో ఆమె భర్త ఏరుకొండ రవి, చిన్న కొడుకు రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-03-02T03:34:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising