ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ లక్షణాలున్న వారు పరీక్షలు చేయించుకోవాలి

ABN, First Publish Date - 2022-01-23T03:32:30+05:30

కొవిడ్‌ లక్షణాలున్న వారు వైద్య బృందానికి సహకరించి పరీక్షలు చేయించుకో వాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ పేర్కొ న్నారు. శనివారం గుడిపేటలో జరుగుతున్న ఇంటింటా ఫీవర్‌సర్వేను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ప్రతీ ఇంటికి వెళ్లి ఆరోగ్య విషయాలను తెలు సుకోవాలన్నారు. జ్వరంతో ఉన్న వారికి మందులను అందజేయాలన్నారు.

గుడిపేటలో ఫీవర్‌ సర్వే పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 హాజీపూర్‌, జనవరి 22: కొవిడ్‌ లక్షణాలున్న వారు వైద్య బృందానికి సహకరించి పరీక్షలు చేయించుకో వాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ పేర్కొ న్నారు. శనివారం గుడిపేటలో జరుగుతున్న ఇంటింటా ఫీవర్‌సర్వేను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ప్రతీ ఇంటికి వెళ్లి ఆరోగ్య విషయాలను తెలు సుకోవాలన్నారు. జ్వరంతో ఉన్న వారికి మందులను అందజేయాలన్నారు. కొవిడ్‌ వస్తే హోంఐసోలేషన్‌లో ఉండాలని పేర్కొన్నారు. మాస్కు  ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉం చుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు.  బుద్ది పెల్లి గ్రామంలో డీఎంహెచ్‌ కొమురం బాలు ఫీవర్‌ సర్వేను పరిశీలించారు. వైద్యాధికారి క్రాంతికుమార్‌,  వైద్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. 

లక్షెట్టిపేటరూరల్‌: ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ అధికారులను ఆదేశించారు. శనివారం గుల్లకోట, సూరారం గ్రామాల్లో సర్వేను పరి శీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు కరోనా నియంత్రణ పట్ల అవగాహన కల్పించారు. ఆరోగ్య సర్వేకు అందరు సహకరించాలని సూచించారు. వైస్‌ ఎంపీపీ దేవేంద ర్‌రెడ్డి, సర్పంచు గోళ్ల రవీందర్‌, ఎంపీడీవో సత్యనారా యణ, పంచాయతీ కార్యదర్శి, సర్వే సిబ్బంది ఉన్నారు. 

ఫీవర్‌ సర్వేను వేగంగా పూర్తి చేయాలి 

మంచిర్యాల కలెక్టరేట్‌: జిల్లాలో ఫీవర్‌ సర్వేను వేగంగా పూర్తి చేయాలని డీఎంహెచ్‌వో కొమురం బాలు పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పలు వార్డులు, మండలాల్లో జరుగుతున్న సర్వేను పరిశీలిం చారు. ఆయన మాట్లాడుతూ  కలెక్టర్‌ ఆదేశానుసారం ప్రతీ ఇంటికి తిరుగుతూ సర్వే నిర్వహించి లక్షణాలు న్న వారికి మందులను పంపిణీ చేయాలని పేర్కొ న్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో ఫయాజ్‌ఖాన్‌, విజయ పూర్ణిమ, అల్లాడి శ్రీనివాస్‌, నాందేవ్‌, బుక్కా వెంకటేశ్వర్‌ పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-01-23T03:32:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising