ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖానాపూర్‌లో దొంగల కలకలం

ABN, First Publish Date - 2022-05-29T07:08:56+05:30

ఖానాపూర్‌లో వరుస దొంగతనాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ రజినీకాంత్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాంతినగర్‌ కాలనీలో ఓ ఇంట్లో చోరీ

ఆరుతులాల బంగారం, 24 తులాల వెండి అపహరణ

వరుస దొంగతనాలతో పట్టణ ప్రజల్లో ఆందోళన

ఖానాపూర్‌, మే 28 : ఖానాపూర్‌లో వరుస దొంగతనాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత మూడునెలల కాలంలో సుమారు పదిచోట్ల దొంగతనాలు జరుగడంతో ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు. తాజాగా శాంతినగర్‌ కాలనీలో జరిగిన దొంగతనంలో ఆరుతులాల బంగారం, 24 తులాల వెండి, రూ.4 వేలనగదు అపహరణకు గురైంది. వివరాల్లోకెలితే ఖానాపూర్‌ ఎస్‌ఐ రజినీకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శాంతినగర్‌కాలనీలో శుక్రవారం అర్దరాత్రి జెట్టిశంకర్‌ అనే ఆర్టీసీ కంట్రోలర్‌ ఇంట్లోఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఉన్న శంకర్‌ భార్య లక్ష్మీ తన ఇంటిసమీపంలో ఉండే తన చెల్లెలు కమల ఇంటికి పడుకునేందుకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి వేసిన తాళం పగులగొట్టిన దొంగలు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న ఆరుతులాల బంగారు ఆభరణాలు, 24 తులాల వెండి ఆభరణాలు, రూ, 4 వేల నగదును అపహారించుకుపోయారు. శనివారం తెల్లవారుజామున ఇంటికి తిరిగొచ్చిన లక్ష్మికి ఇంటితాళం పగులగొట్టి ఉండడం కనిపించడంతో దొంగలు పడ్డారని గ్రహించి లబోదిభోమన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సం ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ ఐ రజినీకాంత్‌ తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో విలువైన వస్తువులు ఇంట్లో ఉంచొద్దని ఎస్‌ఐ రజినీకాంత్‌ పట్టణ ప్రజలను కోరారు. ఇంటికి తాళం వేసి వెళ్లే పరిస్థితి వస్తే ఖచ్చితంగా పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. 

Updated Date - 2022-05-29T07:08:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising