ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటు విలువను గుర్తించాలి

ABN, First Publish Date - 2022-12-06T22:16:21+05:30

సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడం కోసం ఓటు విలువను ప్రతి ఒక్కరూ గుర్తించాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌, డిసెంబరు 6: సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడం కోసం ఓటు విలువను ప్రతి ఒక్కరూ గుర్తించాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్‌ రాజేశంతో కలిసి ఆదివాసీ సంఘాల ప్రతినిధులతో ఓటు నమోదుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని చెప్పారు. పారదర్శకమైన సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడంలో ఓటు హక్కు ప్రధాన మైనదని చెప్పారు. ఓటు హక్కు గల ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగించుకోవడంతో పాటు 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరు ఓటు వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 8వ తేదీన ఓటు నమోదుకు ఆఖరి తేదీగా నిర్ణయించినందున అర్హత గల వారందర నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి మణెమ్మ, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T22:16:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising