ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాహనాలపై పన్ను రద్దు చేయాలి

ABN, First Publish Date - 2022-05-18T04:02:46+05:30

వాహనాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ముంజం ఆనంద్‌ డిమాండ్‌ చేశారు.

మాట్లాడుతున్న సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ముంజం ఆనంద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ముంజం ఆనంద్‌

కాగజ్‌నగర్‌ టౌన్‌, మే 17: వాహనాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులను రద్దు చేయాలని  సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ముంజం ఆనంద్‌ డిమాండ్‌ చేశారు.  వాహనాలపై విధిస్తున్న పన్నులకు నిరసనగా గురువారం నిర్వహించే రాష్ట్ర రవాణా బంద్‌ను విజయంవంతం చేయాలని మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానికంగా ప్రచారం నిర్వహిస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  2019 రోడ్‌ సేఫ్టీ బిల్లును రద్దు చేయాలన్నారు. వాహనాలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఛార్జీలతో కార్మికుల బతుకులు ఆగమయ్యాయని వాపోయారు. రవాణా రంగంపై వేసిన పన్నులను వెంటనే రద్దు చేయాలని కోరారు. వాహనాల ఫిటెనెస్‌ రెన్యూవల్‌ గడువు తీరితే  50 రూపాయల జరిమానా విధించడం దారుణమన్నారు. జీవో 714 వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రవాణా రంగం, కార్మికులు, వాహన యజమానులకు నష్టం కలిగించే ఛార్జీలను తొలగించే వరకు పోరాటం చేస్తామన్నారు. రవాణా రంగం బంద్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయం వంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సయ్యద్‌ శాకీర్‌, మొగిలి, బాషా, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-18T04:02:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising