ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోడు భూముల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

ABN, First Publish Date - 2022-11-15T23:25:49+05:30

పోడు భూముల సర్వేను పకడ్బందీ గా నిర్వహించాలని ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌టౌన్‌, నవంబరు 15: పోడు భూముల సర్వేను పకడ్బందీ గా నిర్వహించాలని ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రం లోని టీటీడీ సమావేశ మందిరంలో మంగళవారం పోడు భూముల సర్వేపై అటవీ శాఖ అధికారి రాజశేఖర్‌తో కలిసి ఎంపీడీవోలు, అటవి, పంచాయతీ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోడు భూముల సర్వేపై గ్రామసభలో దరఖాస్తు దారుల సందేహాలను నివృత్తి చేస్తూ పూర్తి చేయాలన్నారు. చట్టప్రకారం ఇది వరకే సాగులో ఉన్న వారికి మాత్రమే ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు జారీ చేస్తామని, కొత్తగా పోడు చేసే వారికి మంజూరైన పట్టాలను, రైతుబంధును రద్దు చేస్తామనివివరించారు. అధికారులు సమన్వ యంతో పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓవో రాథోడ్‌ర మేష్‌, జడ్పీ సీఈవో గణపతి, ఐటీడీఏ డీడీ దిలీప్‌కుమార్‌, పాల్గొన్నారు.

గ్రామసభలను నిర్వహించాలి

తాంసి: పోడు భూములు సర్వే పూర్తయిన వాటికి గ్రామసభలు నిర్వహించాలని ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం తాంసి ఎంపీడీవో కార్యాలయంలో పోడు భూముల సర్వేపై అధికారులతో సమీక్షించారు. పోడు భూముల సర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహించి ఆదివాసులకు పట్టాలు ఇచ్చేందుకు వీలుగా చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే గ్రామసభలు నిర్వహించిన ఆలోడి, అంబుగాం, పట్నంగూడ, లింగూడ తీర్మానాలను పీవో పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో భూమయ్య, పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-15T23:25:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising