ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తి అరెస్టు

ABN, First Publish Date - 2022-11-12T01:53:46+05:30

మండలంలోని కడ్తాల్‌ గ్రామ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశా రు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోన్‌ రూరల్‌, నవంబరు 11 : మండలంలోని కడ్తాల్‌ గ్రామ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశా రు. మండల కేంద్రంలోని పోలీసుస్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం డీఎస్పీ జీవన్‌రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 3న పెళ్లిపత్రికలు పంచి అర్ధరాత్రి ఇంటికి వస్తున్న క్రమంలో వెనుక వైపు నుండి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో జిల్లాకేంద్రంలోని గుల్జార్‌ మార్కెట్‌కు చెందిన బషీర్‌, అమీర్‌ఖాన్‌లు అక్కడికక్కడే మృతి చెందడంతో పాటు తౌసిఫ్‌ అనే వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదానికి కారణ మైన వ్యక్తులను సీసీ ఫుటేజీల ద్వారా గుర్తించి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ర్టాలకు వెళ్లి, జైపూర్‌ వెళ్లి కంటైనర్‌ వాహనంతో పాటు సద్దాం హుస్సేన్‌ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఇట్టి కేసులో డ్రైవర్‌ను అరెస్టు చేయడంతో పోలీసులను డీఎస్పీ అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో సీఐరామ్‌ నరసింహారెడ్డి, ఎస్సై సంతోషం రవీం దర్‌లతో పాటు పోలీసు సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2022-11-12T01:53:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising