ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టడం శుభపరిణామం

ABN, First Publish Date - 2022-01-22T06:58:14+05:30

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్రసర్కార్‌ ప్రభుత్వం పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లీష్‌ మీడియం తరగతులు ప్రవేశపెట్టడం ఎంతో శుభపరిణామమని పీఆర్‌టీ యూ జిల్లా ప్రధాన కార్యదర్వి బీ.వీ రమణారావు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వా గతించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బీవీ రమణారావు

భైంసా, జనవరి 21 :  విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్రసర్కార్‌ ప్రభుత్వం పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లీష్‌ మీడియం తరగతులు ప్రవేశపెట్టడం ఎంతో శుభపరిణామమని పీఆర్‌టీ యూ జిల్లా ప్రధాన కార్యదర్వి బీ.వీ రమణారావు   ప్రభుత్వ నిర్ణయాన్ని స్వా గతించారు. శుక్రవారం స్థానికంగా విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లా డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంగ్లీష్‌మీడియం ప్రవేశపెట్టడంపై తీసుకున్న  నిర్ణయం పట్ల హర్షంవ్యక్తం చేస్తున్నామన్నారు. విద్యారంగంలో చోటు చేసు కుంటున్న మార్పులకు అనుగుణంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మూలంగా ఇంగ్లీష్‌మీడియంలో చదువుకోవడానికి మంచి అవకాశం దక్కనుందన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు దూరప్రాంతాలకు వేళ్లే ఇబ్బందులు తొలగనున్నాయన్నారు. ఇదేక్రమంలో తల్లిదండ్రులపై కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలల ఆర్థికభారం సైతం తొలగనుందన్నారు. అంతే గాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో అన్నిరకాల వసతుల కల్పనకు రాష్ట్రసర్కార్‌ వినూత్నంగా ప్రవేశపెట్టిన మనఊరు - మనబడి అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆహ్లాదరకమైన వాతా వరణంలో కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యాభోదన జరుగ నుందన్నారు. ఈ సమావేశంలో పీఆర్‌టీయూ ప్రతినిధులు గోపాల్‌, గంగా మోహన్‌, పుండ్లీక్‌తోపాటు పలువురు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-22T06:58:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising