ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితుల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

ABN, First Publish Date - 2022-05-17T04:09:47+05:30

దళితులను ఆర్థిక అభివృద్ధి చేసేందుకు సీఎం దళితుబంఽధు పథకానికి శ్రీకారం చుట్టారని జడ్పీచైర్‌పర్సన్‌ కోవలక్ష్మి అన్నారు.

దళితు బంధు కింద మంజూరైన వాహనం కీని అందజేస్తున్న జడ్పీ చైర్‌ పర్సన్‌ కోవలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి 

ఆసిఫాబాద్‌ రూరల్‌, మే 16: దళితులను ఆర్థిక అభివృద్ధి చేసేందుకు సీఎం దళితుబంఽధు పథకానికి శ్రీకారం చుట్టారని జడ్పీచైర్‌పర్సన్‌ కోవలక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలో దళితబంధు పథకంలో ఎంపికైన వారికి వివిధ వాహనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ అవకాశాన్ని దళితులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే ఆత్రంసక్కు, ఎమ్మెల్సీ దండెవిఠల్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు ఏర్పా టు చేశారన్నారు. అదనపుకలెక్టర్‌ వరుణ్‌రెడ్డి మాట్లా డుతూ దళితుల జీవనోపాధికి వివిధరకాల ప్యాకేజీ లను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు అరిగెల నాగేశ్వర్‌ రావు, సంతోష్‌,  ఎంపీపీలు మోతీరాం, అరిగెల మల్లికార్జున్‌, ఎస్సీ సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు సంజీవ్‌, జిల్లా మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

కన్నిబాయిని ఆదర్శంగా తీసుకోవాలి

గిరిజన కుటుంబంలో జన్మించి ఉత్తరాఖండ్‌లో గల పంగార్చిలా పర్వతారోహణకు బయలు దేరుతున్న జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థిని కన్నిబాయిను ఆదర్శంగా తీసుకోవాలని జడ్పీ ఛైర్‌పర్సన్‌ కోవలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లా డారు. ఆదివాసీ ప్రాంతానికి చెందిన గిరిజన బిడ్డ పర్వతారోహణ చేయడం గర్వంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ దండేవిఠల్‌, ఎమ్మెల్యే ఆత్రంసక్కు మాట్లా డుతూ కన్నిబాయి శ్రమను అంతా గుర్తించి ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ గిరిజన ప్రాంతానికి చెందిన విద్యార్థిని దేశస్థాయిలో గర్వించదగ్గ చక్కటి కార్యక్రమాన్ని చేపట్డం గొప్ప విషయమన్నారు.

అంబేద్కర్‌ ఆశయాలను కొనసాగిద్దాం

రెబ్బెన: అంబేద్కర్‌ ఆశయాలను అంతా కొనసాగిద్దామని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి అన్నారు. సోమవారం మండలంలోని కిష్టాపూర్‌ గ్రామంలో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్‌ అన్నారు. 

ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ దండే విఠల్‌ మాట్లాడుతూ అంబేద్కర్‌ ఆశయాలను కొనసాగిం చాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ సౌందర్య ఆనంద్‌, జడ్పీటీసీ సభ్యుడు సంతోష్‌, సింగిల్‌విండో చైర్మన్‌ సంజీవ్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T04:09:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising