ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2022-11-30T22:15:32+05:30

కాగజ్‌నగర్‌, నవంబరు 30: కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలో అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. బుధవారం కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాల్టీ అభివృద్ధికి అంతా సహకరించాలన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

కాగజ్‌నగర్‌, నవంబరు 30: కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలో అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. బుధవారం కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాల్టీ అభివృద్ధికి అంతా సహకరించాలన్నారు. ఈసందర్భంగా వివిధ వార్డుల కౌన్సిలర్లు పట్టణంలో నెలకొన్న పలు సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషిచేస్తామన్నారు. అదనపుకలెక్టర్‌ చాహత్‌ వాజ్‌పాయ్‌ మాట్లాడుతూ అభివృద్ధి పనులకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్‌చైర్మన్‌ సద్దాంహుస్సేన్‌, వైస్‌చైర్మన్‌ రాచకొండ గిరీష్‌, కమిషనర్‌ అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

వీవీ పాట్‌లు గోవాకు తరలింపు

ఆసిఫాబాద్‌: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 284 వీవీపాట్‌లను గోవాకు తరలించామని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం, వీవీపాట్‌ల గోదాంను అద నపు కలెక్టర్‌ రాజేశం, వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో తెరిచి భారతఎన్నికల సంఘం సూచన మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారులకు 284 వీవీ పాట్‌లను అందించామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేశం, తహసీల్దార్‌ రామ్మోహన్‌, ఎన్నికల డీటీ జితేందర్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T22:15:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising