ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బహుజనులకు రాజ్యాధికారంతోనే బీసీల అభివృద్ధి

ABN, First Publish Date - 2022-12-16T22:21:37+05:30

బహుజన రాజ్యాధికారంతోనే బీసీల అభివృద్ధి సాధ్యమని, పట్టు మని పది శాతం లేని కులాలు పాలిస్తుంటే బీసీలు ఓటు బ్యాంకుగా మారుతున్నారని బీసీ సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మందమర్రి టౌన్‌, డిసెంబరు 16: బహుజన రాజ్యాధికారంతోనే బీసీల అభివృద్ధి సాధ్యమని, పట్టు మని పది శాతం లేని కులాలు పాలిస్తుంటే బీసీలు ఓటు బ్యాంకుగా మారుతున్నారని బీసీ సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. బీసీ విద్యార్థి యువజన పోరుయాత్ర శుక్రవారం మందమర్రికి చేరుకుంది. అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాల వేసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా మెజార్టీ కులాలను రాజకీయంగా ఎదగకుం డా అణచివేస్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించడం లేదని మండిపడ్డారు. బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు రిజర్వేషన్‌ల ప్రకారం అర్హత కల్పించాలని పేర్కొన్నారు. బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్‌, శ్యాం, కుర్మ సంఘం మహిళా అధ్యక్షురాలు మణి మంజరి, జిల్లా పట్టణ నాయకులు శ్రీనివాస్‌, నాయకులు రవి వాల్మికి, కిరణ్‌, ప్రకాష్‌, పాల్గొన్నారు.

మంచిర్యాల కలెక్టరేట్‌: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకా యిలను విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య క్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ నీలకంఠేశ్వర్‌ రావు ఆధ్వర్యం లో నిర్వహించిన బీసీ విద్యార్థి, యువ జన పోరు యాత్రలో మాట్లా డారు. ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ లను నిలబెట్టుకోవడంలో విఫలమైందని ఆరోపిం చారు. నాయకులు నరేందర్‌, శ్రీనివాస్‌, లింగమూర్తి, నల్ల రవి, నరెడ్ల శ్రీనివాస్‌, రాయమల్లు, పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T22:21:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising