ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోయపోచగూడలో ఉద్రిక్తం

ABN, First Publish Date - 2022-07-08T04:20:07+05:30

దండేపల్లి మండలం మాకుల పేట గ్రామ పంచాయతీ పరిధి కోయపోచగూడలో ఉద్రిక్తత నెలకొంది. గురువారం ఆదివాసీలు పోడు భూముల్లో గుడిసెలు వేయడంతో అధికారులు తొల గించేందుకు యత్నించగా ఘర్షణ చోటు చేసుకొంది. అధికారులు, మహిళల మధ్య తోపులాట జరగగా పలువురు మహిళలకు గాయాలయ్యాయి. నాలుగు గంటల పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అధికారులపై తిరగబడుతున్న కోయపోచగూడ గిరిజనులు.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పోడు భూముల్లో గుడిసెలు వేసిన ఆదివాసీలు

 అధికారులు, ఆదివాసీల మధ్య ఘర్షణ

దండేపల్లి, జూలై 7: దండేపల్లి మండలం మాకుల పేట గ్రామ పంచాయతీ పరిధి కోయపోచగూడలో ఉద్రిక్తత నెలకొంది. గురువారం ఆదివాసీలు పోడు భూముల్లో గుడిసెలు వేయడంతో అధికారులు తొల గించేందుకు యత్నించగా ఘర్షణ చోటు చేసుకొంది.  అధికారులు, మహిళల మధ్య తోపులాట జరగగా పలువురు మహిళలకు గాయాలయ్యాయి. నాలుగు గంటల పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తోపు లాటతో కొందరు మహిళలు సొమ్మసిల్లి పడిపోగా, మరి కొందరికి గాయాలయ్యాయి. వారికి 108 అంబు లెన్స్‌లో చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. 

కోయపోచగూడ శివారు అటవీ ప్రాంతంలో పోడు భూముల కోసం ఆదివాసీలు కొంతకాలంగా పోరాడు తున్నారు. ఇటీవల అధికారులు అడ్డుకుని కేసులు నమోదు చేసి మహిళలను జైలుకు పంపించారు. అప్పటి నుంచి పోడు భూముల సమస్య పరిష్కరిం చాలని ఆదివాసీలు అక్కడే నిరసన తెలుపుతున్నారు. 

తాతల కాలం నుంచి అడవిని నమ్ముకొని జీవి స్తున్నామని, తమను అడవి నుంచి దూరం చేయాలని అధికారులు కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. గుడి సెలు తొలగించాలని అధికారులు చెప్పినా వినలేదు. ఆదివాసీలు అధికారులపై దాడికి యత్నించడంతో ఫారెస్ట్‌, పోలీసు అధికారులు, సిబ్బంది వెనుదిరిగారు.  మహిళలని చూడకుండా కర్కషంగా దాడికి యత్నిం చారని పేర్కొన్నారు. పలుమార్లు అధికారులకు విన్న వించామని,  ఇటీవల రాష్ట్ర గవర్నర్‌ను కలిసి తమ బాధను చెప్పుకున్న సమస్య పరిష్కారం కాలేదన్నారు.

 

Updated Date - 2022-07-08T04:20:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising