ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెండర్‌ ప్రకటనను వెనక్కి తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-05-18T05:33:15+05:30

పరిశ్రమలు లేని జిల్లాలో ఉన్న ఒక్క సిమెంట్‌ ఫ్యాక్టరీని కూడా మూసి వేశారని, దాన్ని పునః ప్రారంభించకుండా తుక్కులో అమ్మేందుకు కేంద్రం ఇచ్చిన టెండర్‌ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని సీసీఐ సాధన కమిటీ కో కన్వీనర్‌ నారాయణ అన్నారు.

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న సీసీఐ సాధన కమిటీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌టౌన్‌,మే17: పరిశ్రమలు లేని జిల్లాలో ఉన్న ఒక్క సిమెంట్‌ ఫ్యాక్టరీని కూడా మూసి వేశారని, దాన్ని పునః ప్రారంభించకుండా తుక్కులో అమ్మేందుకు కేంద్రం ఇచ్చిన టెండర్‌ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని సీసీఐ సాధన కమిటీ కో కన్వీనర్‌ నారాయణ అన్నారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం తెలంగాణచౌక్‌లోని రహదారి పై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ ఫ్లెక్సీని దహనం చేసి నిరసన తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లా పారిశ్రామికంగా అత్యధికంగా వెనుకబడిందని, ఉన్న సిమెంట్‌ పరిశ్రమను అమ్మేందుకు కేంద్రం యత్నాలు చేయడం సరికాదని అన్నారు. 65 ఏళ్లు సరిపడా ముడిసరుకు, రవాణాకు రెండు కిలో మీటర్ల దూ రంలో నేషనల్‌ హైవేతో పాటు రైలు మార్గం కూడా ఉందన్నారు. రా ష్ట్ర ప్రభుత్వానికి సంప్రదించకుండా కేంద్రం ఏకపక్షంగా టెండర్‌ను పిలవడం సమంజసం కాదన్నారు. కార్యక్రమంలో సీసీఐ సాధన కమిటీ కో కన్వీనర్‌ రమేష్‌, అరవింద్‌, అరుణ్‌కుమార్‌, బండిదత్తాత్రి, బొర్రన్న, పోశెట్టి, రఫిక్‌, ఈశ్వర్‌, శివ, రాహుల్‌ పాల్గొన్నారు. 

టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో..

టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలోనూ నిరసనలు చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంపు నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్లెక్సీతో ర్యాలీగా నాయకులు వచ్చి కుమ్రంభీం చౌరస్తాలో దహనం చేశారు. సీసీఐని పునః ప్రారంభించి ఉపాధి కలించకుండా తుక్కులో అమ్మేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు అజయ్‌ అన్నారు. ఎంపీ, బీజేపీ నాయకులు సీసీఐ వేలాన్ని ఆపేలా కృషి చేయాలని లేని పక్షంలో పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యకమంలో మున్సిపల్‌ చైర్మన్‌ జోగుప్రేమేందర్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు అజయ్‌, అశ్రఫ్‌, అశోక్‌, సలీంపాషా, సయ్యద్‌ సాజిదొద్దిన్‌, నర్సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-18T05:33:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising