ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్య కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష

ABN, First Publish Date - 2022-01-25T05:57:13+05:30

మండలంలోని ఎడ్‌బిడ్‌ గ్రామానికి చెందిన నందనం రాజు(22) అనే వ్యక్తిని గుండంపల్లి రాములు అనే మరోవ్యక్తి హత్య చేసినట్లు నేరం రుజువైనందున సోమవారం జిల్లా ఏడవ అదనపు న్యాయమూర్తి హరీష కేసు పూర్వాపరాలు విచారించిన అనంతరం నేరస్తుడికి పదేళ్ల జైలుశిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ కల్చరల్‌, జనవరి 24 : మండలంలోని ఎడ్‌బిడ్‌ గ్రామానికి చెందిన  నందనం రాజు(22) అనే వ్యక్తిని గుండంపల్లి రాములు అనే మరోవ్యక్తి హత్య చేసినట్లు నేరం రుజువైనందున సోమవారం జిల్లా ఏడవ అదనపు న్యాయమూర్తి హరీష కేసు పూర్వాపరాలు విచారించిన అనంతరం నేరస్తుడికి పదేళ్ల జైలుశిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ విష యాన్ని పోలీస్‌ లిజనింగ్‌ అధికారి సక్రియా నాయక్‌ వెల్ల డించారు. ఈ సంఘటన 30 నవంబరు 2016లో చోటు చేసుకుంది. అంతకుముందు రోజు మంచినీటి విషయం లో నేరస్తుడి తండ్రి పోశన్న, అన్న మల్లన్న మధ్య గొడవ జరుగగా తండ్రికి మద్దతుగా మాట్లాడిన రాజు అనే వ్యక్తిపై కక్షతో ఓ కల్లు దుకాణం వద్ద దాడి చేయడంతో గాయాలపాలు కాగా భైంసా ఆసుపత్రికి తరలించేలోగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారన్నారు. నేరస్తుడు పారిపోగా ముధోల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ సమయంలో సీఐ రఘుపతి కేసు పరి శోధన చేసి నేరస్తుడిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరి చారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కల్వకుంట్ల వినోదరావు 16 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి విచారించగా నేరం రుజువైంది. 

Updated Date - 2022-01-25T05:57:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising