పాక్షికంగా కూలిన తహసీల్దార్ కార్యాలయం
ABN, First Publish Date - 2022-08-27T06:51:28+05:30
నిర్మల్‌లోని పురాతన తహసీల్దార్ (అర్బన్) కా ర్యాలయం శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా ముందుభాగం కు ప్పకూలింది.
పరుగులు తీసిన సిబ్బంది తప్పిన ప్రాణనష్టం
నిర్మల్ కల్చరల్, ఆగస్టు 26 : నిర్మల్‌లోని పురాతన తహసీల్దార్ (అర్బన్) కా ర్యాలయం శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా ముందుభాగం కు ప్పకూలింది. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది, అక్కడ ఉన్న ప్రజలు అవా క్కయి పరుగులు తీశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చు కున్నారు. సుమారు వంద సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ భవనం గత ఇరవై ఏళ్లుగా శిథిలావస్థకు చేరుకొంది. అదే భవనంలో సిబ్బంది విధులు నిర్వహిస్తు న్నారు. 2016లో అప్పటి ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రిగా వ్యహరించిన మహమూద్ అలీ ఆ సమయంలో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశా రు. అప్పటి నుంచి అది ఇప్పటి వరకు నిర్మాణానికి నోచుకోలేదు. ఒక్కసారిగా భవనం పాక్షికంగా కూలడంతో సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. అది చూసిన జనం అవాక్కయిపోయారు.
ఉన్నతాధికారులకు నివేదించా : తహసీల్దార్ సుభాష్‌చంద్ర
ఈ సందర్భంగా తహసీల్దార్ సుభాష్‌చంద్ర ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.... తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరిన విషయాన్ని కలెక్టర్, తదితర ఉన్న తాధికారులకు ఇదివరకే నివేదించా. ఒక్కసారిగా కార్యాలయం ముందుభాగం కుప్పకూలడంతో సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. నూతన భవనం నిర్మించేందుకు తాత్కాలిక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఉద్యోగులకు భయాందోళనలు తొలగించాలి. లేకుం టే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విధులు నిర్వర్తించాల్సి వస్తుంది.
కూలిన తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్
నిర్మల్‌లోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయం శుక్రవారం మధ్యాహ్నం సమయంలో పాక్షికంగా కూలిపోయిన విషయాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ ఆ భవనాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... భారీ వర్షాలు కురిసిన కారణంగా తహసీల్దార్ కార్యాలయ భవనం ముందుభాగం కుప్పకూలిందని అన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. భవన మరమ్మతుల కొరకు ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, నిర్మల్ ఆర్డీవో తుకారాం, తదితరులున్నారు.
Updated Date - 2022-08-27T06:51:28+05:30 IST