ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాణాలు తీసిన ఫొటో సరదా!

ABN, First Publish Date - 2022-08-06T06:49:47+05:30

మండలంలోని వంకతుమ్మ వాగు వద్ద సరదాగా ఫొటోలు దిగుతూ ఆనందోత్సాహాల్లో మునిగిన మిత్రులను వరద ప్రవాహం మింగేసింది. గురువారం మధ్యాహ్నం ఉట్నూర్‌కు చెందిన మిత్రులు ఓసామా, అద్నాన్‌, జీష్యా, ఆయాన్‌లతో పాటు నిర్మల్‌ గాజులపేటకు చెందిన అస్లాంలు వంకతుమ్మ వాగు వద్ద ఫొటో షూట్‌ కోసం వెళ్లారు. ఫొటోలు దిగుతున్న సందర్భంగా జైనూర్‌ మం డలంలోని సోయినూర్‌ ప్రాంతంతో

అస్లాం (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంకా లభించని ఒక మృతదేహం

ఉట్నూర్‌, ఆగస్టు 5: మండలంలోని వంకతుమ్మ వాగు వద్ద సరదాగా ఫొటోలు దిగుతూ ఆనందోత్సాహాల్లో మునిగిన మిత్రులను వరద ప్రవాహం మింగేసింది. గురువారం మధ్యాహ్నం ఉట్నూర్‌కు చెందిన మిత్రులు ఓసామా, అద్నాన్‌, జీష్యా, ఆయాన్‌లతో పాటు నిర్మల్‌ గాజులపేటకు చెందిన అస్లాంలు వంకతుమ్మ వాగు వద్ద ఫొటో షూట్‌ కోసం వెళ్లారు. ఫొటోలు దిగుతున్న సందర్భంగా జైనూర్‌ మం డలంలోని సోయినూర్‌ ప్రాంతంతో పాటు లక్షెట్టిపేట ప్రాంతంలో జోరైన వర్షం కురవడంతో ఒక్కసారిగా వాగు ప్రవాహం పెరిగింది. దీనిని గమనించకుండా ఫొటోలు  దిగుతున్న యువకులు ఇద్దరు ఆయాన్‌(19), అస్లాం(23) వరద ప్రవా హంలో కొట్టుకుపోయారు. వెంబడి ఉన్న స్నేహితులు సమాచారం అందించడం తో సీఐ సైదారావు ఆధ్వర్యంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరు కున్నారు. రాత్రి వరకు గజ ఈతగాళ్లతో గాలించినప్పటికీ ఫలితం కనిపించ లేదు. కాగా, తిరిగి శుక్రవారం ఉదయం గాలింపు జరుపగా ఆయాన్‌ మృతదేహం వాగులో కొద్దిదూరంలో రాళ్ల మధ్య లభించింది. కాగా అస్లాం ఆచూకీ ఇంకా తెలియలేదని, జాడ కోసం గాలిస్తున్నామని సీఐ సైదారావు, అగ్నిమాపక అధికారి దుర్గం రాజలింగులు తెలిపారు. కాగా, ఉట్నూర్‌కు చెందిన షేక్‌ అలీ కుమారుడైన ఆయాన్‌ మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. నిర్మల్‌ గాజుల పేటకు చెందిన డ్రైవర్‌ కరీం కుమారుడు తన సోదరి దగ్గరికి రాగా స్నేహితులతో కలిసి ఫొటోలు దిగడానికి వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. 

Updated Date - 2022-08-06T06:49:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising