ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులు భావి తరాలకు ఆదర్శంగా నిలవాలి

ABN, First Publish Date - 2022-07-07T07:32:01+05:30

విద్యార్థులు శ్రద్దగా చదువుకొని బావి తరాలకు ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు.

నూతనంగా నిర్మించే ఈద్గా ప్రాంతంను పరిశీలిస్తున్న మంత్రి అల్లోల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌చైన్‌గేట్‌, జూలై 6 : విద్యార్థులు శ్రద్దగా చదువుకొని బావి తరాలకు ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. బుధవారం కుమ్మరి సంఘం నిర్మల్‌ జిల్లా జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ల్లో మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం జాగృతి జిల్లా అధ్యక్షులు బుద్దవరపు గంగాధర్‌, రాష్ట్ర రాజకీయ విభాగం అఽధ్యక్షులు కొత్తపల్లి రమేష్‌, నాయకులు సజ్జన రమేష్‌, చంద్రం, సలిగంటి రమేష్‌, శనిగారపు అనిల్‌,  పరమేశ్‌, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. 

చించోలి ఈద్గాను సందర్శించిన మంత్రి అల్లోల 

నిర్మల్‌ చైన్‌గేట్‌ , జూలై 6 : జిల్లాకేంద్రంలోని చించోలి (భి) శివారు వద్ద ముస్లీం మైనార్టీలకు కేటాయించిన ఈద్గాను బుధవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సందర్శించారు.

 రంజాన్‌, బక్రీద్‌ పండగలకు సంబంధించి ప్రార్థనలు చేసే ప్రాంతాన్ని ముస్లిం మతపెద్దలతో కలిసి పరిశీలించారు. అనంతరం విశ్వనాథ్‌పేట్‌లోని ఈడెన్‌గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిర్మల్‌ పట్టణంలోని ఈద్గాలో ప్రస్తుతం ఉన్న జనాభా సరిపోవడం లేనందున చించోలి (బి) సమీపంలో ఉన్నటువంటి పదిఎకరాల అటవీ భూమిని నూతన ఈద్గా స్థాపించడం కొరకు నిర్ణయించబడిందన్నారు. మున్సిపల్‌ నిధులతో ప్రార్థన నమాజ్‌ చేసుకునే ఈద్గా, కౌంపౌండ్‌వాల్‌, రోడ్డు నిర్మించనున్నట్లు తెలిపారు. వచ్చే రంజాన్‌ పండుగకు ఈద్గాను పూర్తి చేస్తామని తెలిపారు. తె లంగాణ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ అన్ని మతాల అభి వృద్దికి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌ , ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ ధర్మాజీ రాజేంధర్‌, టిఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షులు మారుగొండ రాము, మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌ కుమార్‌, ఎఫ్‌ఆర్‌ఓ జైపాల్‌ రెడ్డి, కౌన్సిలర్‌లు నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-07T07:32:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising