ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమన్వయంలో అభివృద్ధికి పాటుపడాలి

ABN, First Publish Date - 2022-06-29T04:39:08+05:30

అధికారులు, ప్రజాప్రతినిధులతో సమయన్వంతో పని చేసి అభివృద్ధికి పాటుపడాలని ఎంపీపీ సౌందర్య అన్నారు. మంగళవారం రెబ్బెన మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు.

సర్వ సభ్య సమావేశంలో అధికారులను ప్రశ్నిస్తున్న సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎంపీపీ సౌందర్య 

రెబ్బెన, జూన్‌ 28: అధికారులు, ప్రజాప్రతినిధులతో సమయన్వంతో పని చేసి అభివృద్ధికి పాటుపడాలని ఎంపీపీ సౌందర్య అన్నారు. మంగళవారం రెబ్బెన మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆసిఫాబాద్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ మల్లేష్‌  మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేదల కోసం వివిధ పథకాలను ప్రవేశ పెట్టినట్టు, అభివృద్ధి పనులు త్వరితగతిన చేపట్టాలని సూచించారు. పలువురు సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల్లో మంజూరైన యూనిట్లను లబ్ధిదారులకు అందించే సమయంలో కనీసం తమకు సమాచారం ఇవ్వడం లేదని చెప్పారు. మండలంలో పలు చోట్ల విద్యుత్‌ తీగలు వేలాడుతున్నాయని, అధికారులు వాటిని సరిచేయాలని ఎంపీటీసీ దుర్గం రాం అన్నారు. రాజరాం గ్రామంలో స్మశాన వాటిక స్థలం వివాదాన్ని ఎన్నిసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుక పోయినప్పటికీ కూడా ఇంత వరకు పరిష్కరించటం లేదని ఎంపీటీసీ మధునయ్య అధికారుల తీరుపై మండి పడ్డారు. అలాగే జక్కులపెల్లి, కిష్టాపూర్‌లో డంపింగ్‌ యార్డులు, గంగాపూర్‌, లక్ష్మిపూర్‌ స్మశాన వాటికలకు వెళ్లేందుకు దారి సౌకర్యం కల్పించాలని పలువురు సభ్యులు కోరరా. రైతు వేదికలు నిర్వహిస్తున్నారని సంతోషకరమైనప్పటికీ అధికారులు తాగునీటి వసతి కల్పించటం లేదని జడ్పీటీసీ సభ్యుడు వేముర్ల సంతోష్‌, ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌ సభా దృష్టికి తీసుకవచ్చారు. అనంతరం ఎంఈవో వెంకటేశ్వర స్వామి మాట్లాడుతూ మండలంలో మన బడి మన ఊరు కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. సమావేశంలో తహసీల్దార్‌ రియాజ్‌ అలీ, జడ్పీటీసీ సభ్యుడు వేముర్ల సంతోష్‌, వివిధ శాఖ అధికారులు, సర్పంచిలు తదితరులు పాల్గొన్నారు. ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-29T04:39:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising