ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె

ABN, First Publish Date - 2022-09-14T05:21:16+05:30

జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో పని చేస్తున్న శానిటేషన్‌ పేషెంట్‌ కేర్‌ సెక్యూరిటీ గార్డుల సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని సీఐటీయూ జిల్లా కార్య దర్శి అన్నమొల్ల కిరణ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌ టౌన్‌, సెప్టెంబరు 13 : జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో పని చేస్తున్న శానిటేషన్‌ పేషెంట్‌ కేర్‌ సెక్యూరిటీ గార్డుల సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని సీఐటీయూ జిల్లా కార్య దర్శి అన్నమొల్ల కిరణ్‌ అన్నారు. మంగళవారం రిమ్స్‌ ఎదుట సెక్యూరిటీ గార్డులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ సెక్యూరిటీ గార్డులకు జీవో 60 ప్రకారం రూ.15600 వేత నాలు చెల్లించాల్సి ఉండగా కాంట్రాక్టర్‌ కార్మికులకు ఖాతాలోనుంచి కోత లువేస్తున్నారన్నారు. రూ.12093 కార్మికుల ఖాతాల్లో జమచేయాల్సింది ఉండగా రూ.10500 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. పీఎఫ్‌ రూ.3023 చెల్లించాల్సి ఉండగా రూ.1080 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. ఒక్కో కార్మికుడి నుంచి రూ.4 వేల కోతలు విధిస్తూ దోపిడీ చేస్తున్నారన్నారు. కొంతమంది కార్మికులకు అసలు వేతనాలు చెల్లించడం లేదన్నారు. సంవత్సరాల తరబడి పని చేస్తున్న కార్మికులను సైతం పక్కన పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో పని చేస్తున్న కార్మికులకు రెండు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. డీఎంఈ, కలెక్టర్‌, రిమ్స్‌ డైరెక్టర్‌ ఆదేశాలను కాంట్రాక్టర్‌ బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. కార్మికులందరికీ జీవో 60 ప్రకారం పూర్తిస్థాయిలో చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రిమ్స్‌ అధ్యక్ష, కార్యదర్శులు అక్రం ఖాన్‌, పెర్క దేవిదాస్‌, నాయకులు కె.రమేష్‌, సుమన్‌ తాయి, కె.రమాకాంత్‌, పొచ్చన్న, సాయి రాజు, భాగ్య, ఉమ రాధ, శోభ పాల్గొన్నారు.                 

Updated Date - 2022-09-14T05:21:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising