ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-01-21T04:16:31+05:30

కొవిడ్‌ నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంతో పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్యఆరోగ్య, ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు

ఆసిఫాబాద్‌, జనవరి 20: కొవిడ్‌ నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంతో పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్యఆరోగ్య, ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. గురువారం హైదరా బాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో కొవిడ్‌ నియంత్రణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లా డుతూ గ్రామాలు, వార్డుల వారీగా టీంలను ఏర్పాటు చేసి శుక్రవారం నుంచి ప్రతిరోజు 25ఇళ్లలో ఇంటింటి సర్వే నిర్వహించాలని ఆదేశించారు. కొవిడ్‌ నియంత్ర ణలో భాగంగా వ్యాక్సి నేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. రెండో డోసు కొవిడ్‌ వ్యాక్సిన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అంద రికీ బూస్టర్‌ డోస్‌ అందించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో కొవిడ్‌ ఓపీ సేవ లను నిర్వహించాలన్నారు. కొవిడ్‌ లక్షణాలున్న వారందరికీ హోం ఐసోలేషన్‌ కిట్‌ అందజేయాల న్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో ఆక్సిజన్‌ సౌకర్యంతోపాటు కొవిడ్‌ వార్డులను ఏర్పాటు చేశామని, జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ ఆస్పత్రుల డాక్టర్లతో సమీక్ష చేయాలన్నారు. కొవిడ్‌ రోగులకు మంచి పోషక విలువలతో కూడిన భోజనం అందించాలన్నారు. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి మాట్లా డుతూ ఇంతవరకు కొవిడ్‌తో మరణించిన వారికి ప్రభుత్వ ఆర్థిక సహాయం త్వరగా అందించేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్థిక సాయం మంజూరుకు కమిటీ ఏర్పాటు చేశామని అన్నారు. మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న కేసులను కమిటీ వెంటనే పరిష్కరించి ఆర్థిక సాయం మంజూరు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, డీఎంహెచ్‌వో మనోహర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T04:16:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising