ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గణాంక దర్శిని 2020-21 ఆవిష్కరణ

ABN, First Publish Date - 2022-06-30T03:46:14+05:30

జిల్లాలోని అన్నిశాఖల అధికారులు సమన్వయంతో జిల్లా గణాంకదర్శిని 2020-21 పుస్తకాన్ని రూపొందించినట్లు కలెక్టర్‌ రాహు ల్‌రాజ్‌ తెలిపారు. బుధవారం జాతీయ గణాంక దినో త్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో ముఖ్య ప్రణా ళికాధికారితో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు.

గణాంకదర్శినిని ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌, జూన్‌ 29: జిల్లాలోని అన్నిశాఖల అధికారులు సమన్వయంతో జిల్లా గణాంకదర్శిని 2020-21 పుస్తకాన్ని రూపొందించినట్లు కలెక్టర్‌ రాహు ల్‌రాజ్‌ తెలిపారు. బుధవారం జాతీయ గణాంక దినో త్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో ముఖ్య ప్రణా ళికాధికారితో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ పుస్తకంలో జిల్లా జనాభా, వాతావరణం, ఆరోగ్యం, నీటిపారుదల, విద్య, రోడ్డు రవాణా, కోర్టు, పోలీసు తదితర 20రకాల అంశాలను పొందుపరిచామన్నారు. ఈ పుస్తకం ద్వారా గణాంకాలు ఏవిధంగా రోజువారి జీవితంలో ఉపయో గపడుతాయో తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి రవీందర్‌, డిప్యూటీ స్టాటిస్టికల్‌ ఆఫీసర్లు శ్రీపాద, ఎస్‌ వెంకటేశ్వర్లు, రాజ్‌కుమార్‌, గుర వయ్య, మండలప్రణాళికగణాంక అధికా రులు, ఫీల్డ్‌టెక్నిషియన్‌ రాజేష్‌ పాల్గొన్నారు.

విద్యార్థుల ప్రతిభ అభినందనీయం

ఆసిఫాబాద్‌ రూరల్‌: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో జిల్లావిద్యార్థుల ప్రతిభ అభి నందనీయమని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. బుధవారం ఆయన చాంబర్‌ లో ఇంటర్మీడియట్‌లో ప్రతిభకనబర్చిన విద్యార్థులను అభి నందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర టాప ర్‌గా నిలిచిన కాగజ్‌నగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన విద్యార్థి జెల్లఅమన్‌ను పుష్ప గుచ్ఛంతో సత్కరించారు. జిల్లాస్థాయిలో రెండోస్థానం లో నిలిచిన కాగజ్‌నగర్‌లోని వివేకానంద కళాశాలకు చెందినవిద్యార్థిని భావన, తృతీయస్థానంలో నిలిచిన ఆసిఫాబాద్‌ మోడల్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థిని సాయిశ్రీతేజను కూడా సత్కరించారు. డీఐఈవో శ్రీధర్‌ సుమన్‌, ప్రిన్సిపాళ్లు ఖలీల్‌, హనోక్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-30T03:46:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising