ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

ABN, First Publish Date - 2022-12-16T22:24:21+05:30

రాష్ట్ర స్థాయి సబ్‌ జూని యర్‌ అండర్‌-16 బాల బాలికల కబడ్డీ పోటీలు మంచిర్యాలలో శుక్రవారం ఘనంగా ప్రారంభమ య్యాయి. మొదట గుస్సాడి నృత్యాలతో క్రీడాకారు లు, అసోసియేషన్‌ సభ్యులు, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే దివాకర్‌రావు బెల్లంపల్లి చౌరస్తా నుంచి ర్యాలీగా జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానా నికి చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏసీసీ, డిసెంబరు 16: రాష్ట్ర స్థాయి సబ్‌ జూని యర్‌ అండర్‌-16 బాల బాలికల కబడ్డీ పోటీలు మంచిర్యాలలో శుక్రవారం ఘనంగా ప్రారంభమ య్యాయి. మొదట గుస్సాడి నృత్యాలతో క్రీడాకారు లు, అసోసియేషన్‌ సభ్యులు, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే దివాకర్‌రావు బెల్లంపల్లి చౌరస్తా నుంచి ర్యాలీగా జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానా నికి చేరుకున్నారు. అనంతరం 33 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు మార్చ్‌ఫస్ట్‌ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 32వ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ కబడ్డీ పోటీలను మంచిర్యాలలో నిర్వ హించడం గర్వకారణమన్నారు. అన్ని వసతులతో ఈనెల 19 వరకు పోటీలు జరుగుతాయన్నారు. క్రీడా నిర్వహణకు సింగరేణి కాలరీస్‌, దాతలు సహ కరించినట్లు తెలిపారు. పోటీల్లో గెలుపొందిన వారు జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికవుతారన్నారు. 33 జిల్లాల నుంచి 68 టీములకు చెందిన 1100 మంది క్రీడాకారులు, పీఈటీలు, కోచ్‌లు పాల్గొంటున్నట్లు తెలిపారు. సింగరేణి డైరెక్టర్‌ బలరాం మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరక దారుఢ్యం మెరుగుపడుతుం దన్నారు. డీసీపీ అఖిల్‌ మహజన్‌ మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడలు ముఖ్యమేనని, క్రీడల్లో రాణించి జీవితంలో స్ధిరపడాలన్నారు. జీఎం చింత ల శ్రీనివాస్‌, డీవైఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాజయ్య, ఏసీపీ తిరుపతిరెడ్డి, నాయకులు లింగయ్య, ప్రభాకర్‌, భూమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T22:24:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising