ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజావాణిలో సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

ABN, First Publish Date - 2022-09-20T03:59:17+05:30

ప్రజావాణిలో అర్జీదా రులు చేసుకున్న దరఖాస్తుల పరిష్కారంపై సంబంధి తశాఖల అధికారులు సమన్వయంతో ప్రత్యేక దృష్టి సారిస్తారని కలెక్టర్‌రాహుల్‌రాజ్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో తనచాంబర్‌లో అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.

అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 19: ప్రజావాణిలో అర్జీదా రులు చేసుకున్న దరఖాస్తుల పరిష్కారంపై సంబంధి తశాఖల అధికారులు సమన్వయంతో ప్రత్యేక దృష్టి సారిస్తారని కలెక్టర్‌రాహుల్‌రాజ్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో తనచాంబర్‌లో అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. తెలంగాణ మధ్యాహ్నభోజన పథకం వర్కర్స్‌ యూనియన్‌ ప్రతినిధులు గౌరవవేతనం ఇవ్వాలని, మెస్‌ చార్జీలు, కోడిగడ్డు ధరలు పెంచాలని, బిల్లులు ఇవ్వాలని, వేతనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

రెబ్బెన మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన పోచం సర్వేనెం.38(ఈ)లో భూమిని రెవెన్యూ అధికారులు విస్తీర్ణం తప్పుగా నమోదు చేశారని తప్పును సవరించి భూమికి సంబంధించి పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేయాలని, చింతల మానేపల్లి మండలానికి చెందిన నీలాగౌడ్‌ పాఠశాల నిర్మాణ డబ్బులు ఇవ్వాలని, ఆసిఫాబాద్‌ మండలం కంచుకో టకు చెందిన బోగ బాయక్క తనఇంటికి గల దారిని కొందరు ఆక్రమించి గోడ నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారని, దీంతో తాము నడవడానికి దారి లేకుండా ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ఈ విష యంపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని అర్జీ సమర్పించింది. బెజ్జూరు మండలం కుశ్నపల్లి గ్రామా నికి చెందిన లక్ష్మిబాయి పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయాలని, కాగజ్‌నగర్‌ పట్టణంలోని సర్‌సిల్క్‌ కాలనీకి చెందిన భద్రమ్మ వృద్ధాప్య పెన్షన్‌ కొరకు, ఎల్లారం గ్రామానికి చెందిన శంకర్‌ దివ్యాంగుల పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

Updated Date - 2022-09-20T03:59:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising