ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలల సంరక్షణపై ప్రత్యేక దృష్టి

ABN, First Publish Date - 2022-01-25T04:14:02+05:30

బాలల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు డీడబ్ల్యూవో సావిత్రి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బాలరక్ష భవన్‌లో జాతీయ బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లా డారు.

మాట్లాడుతున్న డీడబ్ల్యూవో సావిత్రి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- డీడబ్ల్యూవో సావిత్రి 

ఆసిఫాబాద్‌, జనవరి 24: బాలల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు డీడబ్ల్యూవో సావిత్రి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బాలరక్ష భవన్‌లో జాతీయ బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లా డారు. జిల్లాలో మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాలికల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అనంతరం జిల్లా బాలల సంరక్షణాధికారి మహేష్‌ మాట్లాడుతూ జిల్లా బాలల సంరక్షణ విభాగం ద్వారా బాలబాలికల రక్షణకు కృషి చేస్తామన్నారు. ఆపద సమయంలో బాలికలు 1098, 100, 181 హెల్ప్‌లైన్‌ నంబర్లకు ఫోన్‌ చేస్తే వెంటనే రక్షణ చర్యలు చేపడుతామన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బాలికలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పోషణ అభియాన్‌ జిల్లా కోఆర్డినేటర్‌ గోపాలకృష్ణ, సఖీ కేంద్రం నిర్వహకురాలు సౌజన్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో మండ లంలోని అంకుశాపూర్‌ గ్రామంలో బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి స్వీట్లను పంపిణీ చేశారు. ఎమ్మార్పీఎస్‌ నాయకులు కేశవ్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-25T04:14:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising