ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శానిటేషన్‌పై ప్రత్యేకశ్రద్ధ కనబరచాలి: కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-12-16T01:42:17+05:30

గ్రామీణాభివృద్ధి పనుల పురోగతి, మిషన్‌ భగీరథపై గురువారం జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ ఫారూఖీ అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడేతో కలిసి జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో ఎంపీడీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ చైన్‌గేట్‌, డిసెంబరు 15 : (రూరల్‌ డెవలప్‌మెంట్‌) గ్రామీణాభివృద్ధి పనుల పురోగతి, మిషన్‌ భగీరథపై గురువారం జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ ఫారూఖీ అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడేతో కలిసి జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో ఎంపీడీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి పల్లె ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్‌ షెడ్లు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, శానిటేషన్‌ పురోగతిపై మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు. జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ.. రోడ్లపై మట్టి, పిచ్చి మొక్కలు, గడ్డి తొలగించాలని, ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. శానిటేషన్‌ అస్సలు బాగాలేదని అసహనం వ్యక్తం చేశారు. పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసు కుంటుందని, అందులో భాగంగానే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెడుతుందని, వాటిని సక్రమంగా అమలు చేసే బాధ్యత క్షేత్రస్థాయి సిబ్బందిపై ఉందన్నారు. మిగిలి ఉన్న తెలంగాణ క్రీడా ప్రాంగణాల పనులు వెంటనే పూర్తి చేసి వినియోగంలోకి తేవాలన్నారు. పల్లె ప్రకృతి వనాలు ప్రతిరోజు సందర్శించి వాటి సంరక్షణ బాధ్యత పక్కాగా అమలు చేయాలని అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా బ్యాగ్‌ ఫిల్లింగ్‌ చేసి సీడ్స్‌ సిద్ధం చేసుకోవాలన్నారు. బృహత్‌ పల్లె ప్రకృతివనాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. నర్సరీలో డిమాండ్‌లో ఉన్న మొక్కలను ప్లాంటేషన్‌ సిద్ధం చేయాలని, నిర్మల్‌ జిల్లాను పచ్చదనం, పరిశుభ్రత, ఆహ్లాదకరమైన వాతావరనంలో ఉంచేందుకు అధికారులు సంబంధిత శాఖల సిబ్బంది నిబద్ధతతో పని చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. పంచాయతీ సెక్రటరీలు విధులకు సకాలంలో హాజరవ్వాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో డీఆర్‌డీఏ విజయలక్ష్మి, ఎంపీడీవోలు, ఎంపీవో, ఏవోలు, తది తరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T01:42:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising