ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జొన్నలను కొనుగోలు చేయాలి

ABN, First Publish Date - 2022-06-14T06:51:15+05:30

యాసంగిలో పండించిన జొన్న పంటలను వానాకాలం సీజన్‌ ప్రారంభమైనా.. ఇంకా కొనుగోలు చేపట్టక పోవడం దారుణమని రైతు స్వరాజ్య వేదిక అధ్యక్షుడు సంగెపు బొర్రన్న అన్నారు. జిల్లాలో రైతు లు పండించిన జొన్నలను కొనుగోలు చేయాలని డిమాండ్‌తో రైతు స్వరాజ్య వేది క, అఖిల పక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

కలెక్టరేట్‌కు ర్యాలీగా వస్తున్న అఖిల పక్ష రైతు సంఘం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ చౌక్‌లో అఖిలపక్ష రైతు సంఘాల ఆందోళన

ఆదిలాబాద్‌ టౌన్‌, జూన్‌ 13: యాసంగిలో పండించిన జొన్న పంటలను  వానాకాలం సీజన్‌ ప్రారంభమైనా.. ఇంకా కొనుగోలు చేపట్టక పోవడం దారుణమని రైతు స్వరాజ్య వేదిక అధ్యక్షుడు సంగెపు బొర్రన్న అన్నారు. జిల్లాలో రైతు లు పండించిన జొన్నలను కొనుగోలు చేయాలని డిమాండ్‌తో రైతు స్వరాజ్య వేది క, అఖిల పక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జొన్నలను కిందపోసి ప్రభుత్వ వైఖరిని ఎండగడు తూ నినాదాలు చేశారు. ప్రభుత్వం సూచన మేరకు యాసంగిలో జొన్నలు వేసినా.. ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదని ఆరోపించారు. బొర్రన్న మాట్లాడుతూ యాసంగిలో రైతులు జొన్న పంటలను ప్రభుత్వ సూచన మేరకు వేశారన్నారు. పంట చేతికి వచ్చి నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేపట్టడం లేదన్నారు. ఎఫ్‌సీఐ లేదా నాఫెడ్‌ ద్వారా మద్దతు ధరతో కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేసే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఇందులో రైతు సంఘాల నాయకులు బద్దం వినోద్‌రెడ్డి, నర్సింహులు, నారాయణరెడ్డి, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్‌, రాఘవేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-14T06:51:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising