నేడు కౌటాలకు స్మితాసబర్వాల్, మంత్రి ఐకే రెడ్డి రాక
ABN, First Publish Date - 2022-02-01T04:21:50+05:30
మండలానికి ఆనుకుని ఉన్న వార్ధా నదిపై వీర్దండి-గుండిపేట మధ్యలో నిర్మించే ప్రాజెక్టు స్థలపరిశీలనకు మంగళవారం సీఎంవో ముఖ్య కార్యదర్శి స్మితసబర్వాల్‌తో పాటు దేవాదాయ, అటవీశాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వస్తున్న నేప థ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.
- వార్ధా ప్రాజెక్టుకు స్థల పరిశీలన
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
కౌటాల, జనవరి 31: మండలానికి ఆనుకుని ఉన్న వార్ధా నదిపై వీర్దండి-గుండిపేట మధ్యలో నిర్మించే ప్రాజెక్టు స్థలపరిశీలనకు మంగళవారం సీఎంవో ముఖ్య కార్యదర్శి స్మితసబర్వాల్‌తో పాటు దేవాదాయ, అటవీశాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వస్తున్న నేప థ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. హెలి క్యాప్టర్ దిగేందుకు పత్తిచేనును చదును చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద గతంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సృజల స్రవంతి ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం మరు గున పడడంతో ఈ ప్రాంత అవసరాల దృష్ట్యా వార్ధా ప్రాజెక్టు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుం టోంది. ఇందులో భాగంగా సీఎంవో ముఖ్య కార్యదర్శి స్మితాసబర్వాల్, మంత్రి ఐకేరెడ్డి, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్థలాన్ని పరిశీలించి ప్రాజెక్టుపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఈప్రాజెక్టు నిర్మాణం వల్ల కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలోని ఐదు నియో జక వర్గాల్లో రెండు లక్షల ఎక రాలకు నీరందించే అవకాశం ఉంది. అధికారిక లెక్కల ప్రకారం ఈప్రాజెక్టులో నాలుగు టీఎంసీ నీరునిలువ ఉంటుంది. ఎక్కువగా వచ్చేనీటిని విని యోగిస్తూ ఉంటే సంవత్సరం పొడువున 20టీఎంసీల నీటిని వినియోగించే అవకాశం ఉంది. 2017-18లో ఈ ప్రాజెక్టుకు రూ.1300 కోట్లు ఖర్చు అవు తుందని అంచనా వేయగా ప్రస్తుతం పెరిగే అవకాశం ఉంది. ఏదీ ఏమైనప్పటికీ ఈ ప్రాజెక్టు నిర్మిస్తే ఈప్రాంత రైతులు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. వ్యాప్కో సంస్థ గుర్తించిన స్థలాన్ని ఇరిగేషన్ డీఈలు వెంకటరమణ, ప్రకాష్, ఆర్‌అండ్‌బీ డీఈ లక్ష్మీనారాయణ పరిశీలించారు. తహసీల్దార్ రాంలాల్, ఎంపీడీవో నస్రుల్లాఖాన్, ఎస్సై ఆంజనేయులు, ఎంపీవో శ్రీధర్‌రాజు, ఏఈ రవికిరణ్, స్థానిక సర్పంచ్ ఉన్నారు.
Updated Date - 2022-02-01T04:21:50+05:30 IST