ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మన ఊరు మన బడితో పాఠశాల అభివృద్ధి

ABN, First Publish Date - 2022-06-26T03:48:48+05:30

మన ఊరు మన బడి కార్యక్రమంతో జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలలను అభివృద్ధి చేస్తామని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో అదనపుకలెక్టర్‌ చాహత్‌ బాజ్‌ పేయితో కలిసి పంచాయతీరాజ్‌, రోడ్లు భవనాలు, విద్యాశాఖాధికారులు, డీఈలు, ఏఈలతో సమీక్ష సమా వేశం నిర్వహించారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

ఆసిఫాబాద్‌, జూన్‌ 25: మన ఊరు మన బడి కార్యక్రమంతో జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలలను అభివృద్ధి చేస్తామని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో అదనపుకలెక్టర్‌ చాహత్‌ బాజ్‌ పేయితో కలిసి పంచాయతీరాజ్‌, రోడ్లు భవనాలు, విద్యాశాఖాధికారులు, డీఈలు, ఏఈలతో సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ జిల్లాలో 246పాఠవాలలు ఉన్నాయని, వీటిలో వంటశాలల మరమ్మతులు ఉన్న వాటిని వెంటనే చేపట్టాలన్నారు. ప్రహరీలు, భోజన శాలలు, తరగతి గదులను ఫొటోలు తీసి పంపించాలన్నారు. 16 పాఠ శాలలో ప్రహరీలు కూలిపోయి ఉన్నాయన్నారు. వాటికి మరమ్మతులు చేపట్టాలన్నారు. ప్రతి పాఠశాలకు మిషన్‌ భగీరథ నల్లా కనెక్షన్‌ అందించాలన్నారు. విద్యుత్‌ సరఫరా, ప్రహరీ, తాగునీటి వసతులను శాశ్వత ప్రాతిపదికపై ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశిం చారు. ఈజీఎస్‌ పథకం కింద జిల్లాలో అవ సరం ఉన్న పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించాలని తెలిపారు. నిర్మాణ పనులకు అవసర మైన టెండర్‌ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయా లన్నారు. జూలై7 నాటికి జిల్లాలోని అన్ని ఆదర్శ పాఠశాలలను పూర్తిహంగులతో సిద్ధం చేయాలన్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన, మెరుగైన విద్యను అందించాలని అన్నారు.

Updated Date - 2022-06-26T03:48:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising