ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలి

ABN, First Publish Date - 2022-12-16T22:19:50+05:30

పెండింగ్‌లో ఉన్న రూ.3,500 కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు రెడ్డి చరణ్‌ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెల్లంపల్లి, డిసెంబరు 16: పెండింగ్‌లో ఉన్న రూ.3,500 కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు రెడ్డి చరణ్‌ పేర్కొన్నారు. శుక్రవారం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో కాంటా చౌరస్తా నుంచి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు డబ్బులు కడితేనే సర్టిఫికెట్‌లు ఇస్తామని పేర్కొంటున్నారని, దీంతో నిరుపేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న జూనియర్‌ కళాశాలకు ప్రహారీలు లేకపోవడంతో అసాంఘిక కార్యకలా పాలకు అడ్డాగా మారాయన్నారు. సబ్‌ కలెక్టర్‌ శ్యామలదేవికి వినతిపత్రం అం దించారు. పీడీఎస్‌యూ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌, రాష్ట్ర సహాయ కార్యదర్శి తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షుడు సిద్దార్ద్‌, నాయకులు వినోద్‌, తిరుపతి, చేతన్‌, సంతోష్‌, రమ్య, సంగీత, శ్రావణి, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T22:19:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising