ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పదోన్నతులు, బదిలీల షెడ్యూల్‌ విడుదల చేయాలి

ABN, First Publish Date - 2022-05-19T04:59:54+05:30

ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు.

కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న యూఎస్‌పీసీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు

ఏసీసీ, మే 18: ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు.  జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట  బుధవారం  యుఎస్‌పీసీ నాయకులు  ఆందోళన నిర్వహించి కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 317 జీవో వల్ల నష్టపోయిన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఉపాధ్యాయులు గా నాలుగేండ్లుగా బదిలీలు, ఏడేండ్లుగా పదోన్నతులు, 15 ఏండ్లుగా పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీకాక తీవ్ర సంక్షోభం నెలకొందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉత్తర్వుల ప్రకారం బదిలీలు, పదోన్నతులకు ఆటంకాలు తొలగిపోయాయని చెప్పారు.  వెంటనే సాధారణ బదిలీలు, పదోన్నతులు చేపట్టాల న్నారు. 2022 మార్చి 22న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపడతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. వేసవి సెలవులు ప్రారంభమై మూడు వారాలు గడుస్తున్నా విద్యాశా ఖ అధికారులు షెడ్యూలు విడుదల చేయకుండా తాత్సారం చేస్తున్నా రని తెలిపారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు గోళ్లరామన్న, ప్రధాన కార్యదర్శి రాజవేణు,  డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రమేశ్‌, ప్రధాన కార్యదర్శి జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T04:59:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising