రాజీనామాలను ఉపసంహరించుకున్న సర్పంచులు
ABN, First Publish Date - 2022-12-31T23:01:34+05:30
వాంకిడి, డిసెంబరు 31: సంచలనం రేపిన వాంకిడి మండల ఆదివాసీ సర్పంచుల రాజీనామాకు తెరపడింది. మండలానికి చెందిన 18మంది ఆది వాసీ సర్పంచులు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేయడంతో అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది.
వాంకిడి, డిసెంబరు 31: సంచలనం రేపిన వాంకిడి మండల ఆదివాసీ సర్పంచుల రాజీనామాకు తెరపడింది. మండలానికి చెందిన 18మంది ఆది వాసీ సర్పంచులు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేయడంతో అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో మూడురోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరుకోనప్ప, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రంసక్కు సర్పంచులతో చర్చలు జరిపారు. సర్పంచులు పేర్కొన్న సమస్య లను సత్వరమే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారు. తక్ష ణమే మండల కేంద్రంలో ఆదివాసీ భవనాన్ని నిర్మించాలని సమావేశంలో నిర్ణ యించారు. భవన నిర్మాణంతోపాటు గిరిజనగ్రామాల్లో అంతర్గత రోడ్లు, నీటి వసతి, పంచాయతీలకు రావాల్సిన నిధులు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. దీంతో ఆదివాసీ సర్పంచ్‌లు తమ రాజీనామాలను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఆదివాసీ భవన నిర్మాణానికి భూమిపూజ
వాంకిడి మండల కేంద్రంలో రూ.21లక్షలతో ఆది వాసీ భవన నిర్మాణానికి జడ్పీచైర్‌పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆది వాసీల సంక్షేమానికి కృషిచేస్తుందని అన్నారు. ఆదివాసీ గ్రామాలకు రోడ్లు, మంచినీటి సదుపాయం కల్పించేందుకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పంచాయతీల నిధుల విషయమై మంత్రులు, సీఎం దృష్టి తీసు కువెళ్లి విడుద లయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ ముండే విమలాబాయి, జడ్పీటీసీ అజయ్‌కుమార్, వాంకిడిమండల సర్పంచుల సంఘం అధ్య క్షుడు బండె తుకారం, ఆదివాసీ సర్పంచులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-31T23:01:36+05:30 IST