ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి

ABN, First Publish Date - 2022-07-01T04:57:33+05:30

వర్షాకాలం దృష్ట్యా గ్రామా ల్లో పారిశుధ్య పనులను పకడ్బందీగా చేపట్టాలని, ఇందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అద నపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ సూచించారు. గురువారం ఎంపీడీవో సమావేశ మందిరంలో భీమిని, కన్నెపల్లి మండల పరిషత్‌ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 8వ విడత హరితహారాన్ని విజయవంతం చేసేం దుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

మాట్లాడుతున్న జిల్లా అదనపు కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమిని, జూన్‌ 30: వర్షాకాలం దృష్ట్యా గ్రామా ల్లో పారిశుధ్య పనులను పకడ్బందీగా చేపట్టాలని, ఇందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అద నపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ సూచించారు. గురువారం ఎంపీడీవో సమావేశ మందిరంలో భీమిని, కన్నెపల్లి మండల పరిషత్‌ సిబ్బందితో  సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 8వ విడత హరితహారాన్ని విజయవంతం చేసేం దుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఏడు విడతల్లో చేపట్టిన  కార్యక్రమాలు విజయవంతమ య్యాయని, ఇదే స్ఫూర్తితో 8వ విడత విజయ వంతం చేయాలన్నారు. రెండు మండలాలను జిల్లాలోనే ముందంజలో నిలపాలన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సూచించారు. మొక్కల సంరక్షణ బాధ్యత కార్యదర్శులదేనని తెలి పారు.  డీఆర్‌డీవో శేషాద్రి, అడిషనల్‌ డీఆర్‌డీవో దత్తరావు, డీఎల్‌పీవో ఫణీందర్‌రావు, ఎంపీడీవో రాధాకృష్ణ, ఏపీవో భాస్కర్‌రావు, ఈజీఎస్‌ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. 

మందమర్రిరూరల్‌: గ్రామాల్లో సీజనల్‌ వ్యాధు ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ పేర్కొన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం నిర్వహిం చారు. ఆయన మాట్లాడుతూ  గ్రామాల్లో పారిశుఽ ద్య పనులను ముమ్మరంగా చేపట్టాలని సూచిం చారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగా హన కల్పించాలన్నారు. చెత్తా, చెదారం సేకరించి డంపింగ్‌ యార్డులకు తరలించాలని కార్యదర్శు లకు సూచించారు. హరితహారానికి మొక్కలను సిద్ధం చేయాలన్నారు. డీఆర్‌డీవో శేషాద్రి, డీపీవో నారాయణరావు, అదనపు పీడీ దత్తారావు, ఎంపీ డీవో శశికళ, ఏపీవో రజియాసుల్తానా, కార్యదర్శు లు,  పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-01T04:57:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising