ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలాభివృద్ధి

ABN, First Publish Date - 2022-03-06T03:58:08+05:30

కేంద్రప్రభుత్వ నిధుల తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ కొత్తపల్లిశ్రీనివాస్‌ అన్నారు. మండలకేంద్రంలో శనివా రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మాట్లాడుతున్న డాక్టర్‌ శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ కొత్తపల్లిశ్రీనివాస్‌

చింతలమానేపల్లి, మార్చి 5: కేంద్రప్రభుత్వ నిధుల తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ కొత్తపల్లిశ్రీనివాస్‌ అన్నారు. మండలకేంద్రంలో శనివా రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 340పడకల ఆస్పత్రిని పరిశీలిం చిన మంత్రి హరీష్‌రావు ప్రోటోకాల్‌ పాటించకుండా హడావుడిగా శంకుస్థాపన చేశారన్నారు. కాగజ్‌నగర్‌లో ఏడు సంవత్సరాలుగా పూర్తిచేయకుండా ఉన్న 30 పడకల ఆస్పత్రి గురించి కనీసం మాట్లాడలేదన్నారు. కేవలం ఎమ్మెల్యే నిర్వహించే అన్నదానసత్రాన్ని పరిశీ లించి వెళ్లడం విచిత్రమని ఎద్దేవా చేశారు. శ్రీశైలం, శంకరయ్య, తిరుపతిగౌడ్‌, శశికళ పాల్గొన్నారు.

- క్రీడలను సద్వినియోగం చేసుకోవాలి

యువత క్రీడాపోటీలను సద్వి నియోగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు డాక్టర్‌ కొత్త పల్లిశ్రీనివాస్‌ అన్నారు. శనివారం మండలంలోని దిందా గ్రామంలో  ఏర్పాటు చేసిన క్రికెట్‌ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో ముందుకుసాగాల న్నారు. సర్పంచ్‌ నానయ్య, చిన్నన్న, పోశన్న, భిక్షపతి పాల్గొన్నారు.

Updated Date - 2022-03-06T03:58:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising