ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అటవీ భూములపై హక్కులు కల్పించాలి

ABN, First Publish Date - 2022-05-19T05:07:07+05:30

నిర్మల్‌ జిల్లాలోని కడెం మండలం నచ్చనిఎల్లాపూర్‌ ప్రాంతంలోని గోండుగూడకు చెందిన గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు అటవీ హక్కు పత్రాలు కల్పించాలని కోరుతూ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉట్నూర్‌, మే 18 : నిర్మల్‌ జిల్లాలోని కడెం మండలం నచ్చనిఎల్లాపూర్‌ ప్రాంతంలోని గోండుగూడకు చెందిన గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు అటవీ హక్కు పత్రాలు కల్పించాలని కోరుతూ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి విలాస్‌ మాట్లాడుతూ గోండు గిరిజనులు  సాగు చేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు కావాలని ప్రభుత్వ ఆదేశా ల మేరకు దరఖాస్తులు సమర్పించిన అధికారులు చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు. 114 సర్వే నెంబర్‌లో అటవీ హక్కుల చట్టం కింద 3.04 గుంటలు మాత్రమే ఇచ్చారని, పక్కనే ఉన్న అటవీ భూమిని సా గుకు యోగ్యంగా చేసుకొని గిరిజనులు సాగు చేస్తున్నందున అటవీ శాఖ అధికారులు కేసులు పెట్టి జైలుకు పంపారన్నారు. భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వం అటవీ హక్కు చట్టం ప్రకారం మూడు ఎకరాల భూమి ఇవ్వాలని అన్నారు. గోండుగూడకు చెందిన 25 కుటుంబాలకు తక్షణమే భూములు ఇచ్చి పట్టాలు ఇవ్వాలని, అదే విధంగా లంబాడీ తాండ గిరిజనుల భూములకు కూడా హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. అడవి సారంగపూర్‌ ప్రాంతంలో ఉన్న గిరిజనులు 23 ఏళ్లుగా సాగు చేస్తున్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని అన్నారు. గోండుగూడకు బోరు వేయించి తాగునీటి సౌకర్యం కల్పించాలని, త్రీఫేజ్‌ విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని కోరుతూ ఐటీడీఏ అధికారులకు వినతి పత్రం సమర్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గెడా తుకారాం, జిల్లా కార్యవర్గ సభ్యుడు  ఎస్‌ఎస్‌రెడ్డి, నాయకులు వెడ్మనాగోరావు, లక్ష్మణ్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-19T05:07:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising