ఎన్టీఆర్ సాగర్‌లో చేప పిల్లల విడుదల
ABN, First Publish Date - 2022-11-15T22:10:01+05:30
మండలంలోని ఎన్టీఆర్ సాగర్‌లో మంగళవారం 3.78 లక్షల చేపపిల్లలతో పాటు 1.70 లక్షల రొయ్య పిల్లలను జారవిడిచారు.
చేప పిల్లలను జార విడుస్తున్న నాయకులు
తిర్యాణి, నవంబరు 15: మండలంలోని ఎన్టీఆర్ సాగర్‌లో మంగళవారం 3.78 లక్షల చేపపిల్లలతో పాటు 1.70 లక్షల రొయ్య పిల్లలను జారవిడిచారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖాధికారి సాంబశివరావు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 260 చెరువుల్లో 1.37 కోట్ల చేప పిల్లలను వదలడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటి వరకు 90 శాతం పూర్తయిందని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్, ఆర్‌ఎస్‌ఎస్ అధ్యక్షుడు శంకర్‌గౌడ్, నాయకులు రాజయ్య, మల్లేష్, మత్స్యకారులు మల్లేష్, రమేష్, సతీష్, భీమయ్య, రాజేశం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-11-15T22:10:03+05:30 IST