ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోక్‌అదాలత్‌తోనే సత్వర న్యాయం

ABN, First Publish Date - 2022-08-14T04:29:22+05:30

లోక్‌ అదాలత్‌తోనే సత్వర న్యాయం అందు తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర శర్మ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో నిర్వహిం చిన జాతీయ లోక్‌అదాలత్‌లో పాల్గొని మాట్లాడారు. రాజీమార్గమే రాచమార్గ మని కక్షిదారులు లోక్‌ అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఆసిఫాబాద్‌లో కేసులు పరిష్కరిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర శర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 13: లోక్‌ అదాలత్‌తోనే సత్వర న్యాయం అందు తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర శర్మ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో నిర్వహిం చిన జాతీయ లోక్‌అదాలత్‌లో పాల్గొని మాట్లాడారు. రాజీమార్గమే రాచమార్గ మని కక్షిదారులు లోక్‌ అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్‌, సిర్పూర్‌(టి) కోర్టు పరిధిలోని 421 కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించారు. సీనియర్‌ సివిల్‌జడ్జి వెంకటేష్‌, జూని యర్‌ సివిల్‌ జడ్జి ఉమామహేశ్వరి, బార్‌అసోసియేషన్‌ అధ్యక్షుడు సతీష్‌బాబు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

సిర్పూర్‌(టి): సిర్పూర్‌(టి)లో న్యాయమూర్తి రవి మాట్లాడుతూ లోక్‌అదాలత్‌లో ఇరువర్గాలు రాజీ మార్గంలో కేసులు పరిష్కరించు కుంటే అప్పీల్‌కువెళ్లే అవకాశం ఉండదన్నారు. అనంతరం కాగజ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని 331 కేసులను రాజీమార్గంలో పరిష్కరించారు. న్యాయవాదులు శంకర్‌రావు, గణపతి, కళ్యాణ్‌, శ్రీనివాస్‌, దయరాజ్‌సింగ్‌, ఎస్సై రవికుమార్‌ ఉన్నారు.

Updated Date - 2022-08-14T04:29:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising