ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య

ABN, First Publish Date - 2022-05-18T05:36:42+05:30

ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ కళాశాల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మౌలిక వసతులను కల్పిస్తున్నామని మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌టౌన్‌, మే 17: ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ కళాశాల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మౌలిక వసతులను కల్పిస్తున్నామని మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ అన్నారు. మంగళవారం పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ కళాశాలలో అడ్మిషన్ల కరపత్రాలు, వాల్‌ పోస్టర్లను విడుదల చేశారు. ముందుగా కళాశాలలోని వసతులను గురించి ప్రిన్సిపాల్‌ జనగం అనితను అడిగి తెలుసుకున్నారు. బోధన, హాస్టల్‌ గురించి వివరాలను ప్రిన్సిపాల్‌ చైర్మన్‌కు తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ జోగుప్రేమేందర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ విద్య సంస్థల్లో విద్యార్థులకు పూర్తి స్థాయి సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. డిగ్రీ కళాశాలలో విద్యార్థులు చేరి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కళాశాల ప్రినిపాల్‌ అనిత అన్నారు. అన్ని రకాల వసతులున్నాయని, కంప్యూటర్‌ ల్యాబ్‌తో పాటు మహిళలకు హాస్టల్‌, జిమ్‌ సౌకర్యాలున్నాయని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బండారి సతీష్‌, అశోక్‌ స్వామి, అధ్యాపకులు ముజీబ్‌, సంతోష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-18T05:36:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising