ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా జాతీయ పైలెట్స్‌ దినోత్సవం

ABN, First Publish Date - 2022-05-27T04:35:14+05:30

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని 108 వాహనాల జిల్లా కార్యాలయంలో గురువారం జాతీయ పైలెట్స్‌ దినోత్సవాన్ని నిర్వహించారు. 108 అంబులెన్స్‌ వాహనాల ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ సామ్రాట్‌ హాజరై కేక్‌ కట్‌ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను రక్షించడంలో పైలట్ల పాత్ర కీలకమైందని తెలిపారు. అంబులెన్స్‌లను ఎప్పుడు అందుబాటులో ఉంచుతూ మెరుగైన వైద్య సేవలు అందించాలని, సకాలంలో ప్రమాదాలు జరిగిన సంఘటన స్థలానికి చేరుకోవాలని సూచించారు.

కేక్‌ కట్‌ చేస్తున్న 108 వాహనాల ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ సామ్రాట్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల కలెక్టరేట్‌, మే 26 : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని 108 వాహనాల జిల్లా కార్యాలయంలో గురువారం జాతీయ పైలెట్స్‌ దినోత్సవాన్ని నిర్వహించారు. 108 అంబులెన్స్‌ వాహనాల ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ సామ్రాట్‌ హాజరై కేక్‌ కట్‌ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను రక్షించడంలో పైలట్ల పాత్ర కీలకమైందని తెలిపారు. అంబులెన్స్‌లను ఎప్పుడు అందుబాటులో ఉంచుతూ మెరుగైన వైద్య సేవలు అందించాలని, సకాలంలో ప్రమాదాలు జరిగిన సంఘటన స్థలానికి చేరుకోవాలని సూచించారు. అత్యవసర కేసుల సేవలో రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా మొదటి స్థానంలో ఉందని తెలిపారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. జిల్లా 108 కార్యనిర్వహణ అధికారి కొండలరావు, ఉమ్మడి జిల్లా ఫీల్డ్‌ కో ఆర్డినేటర్‌ ఆజాద్‌, జీవీకే ప్రధాన కార్యాలయం సిబ్బంది గజానంద్‌, అరుణ్‌, వెంకటేష్‌, అంబులెన్స్‌ వాహనాల సిబ్బంది పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-27T04:35:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising