ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌ హయాంలోనే పల్లెల్లో ప్రగతి

ABN, First Publish Date - 2022-01-24T05:04:37+05:30

రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ సీఎంకేసీఆర్‌ హయాంలోనే పల్లెల్లో ప్రగతి జరుగుతుందని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


జైనథ్‌, జనవరి 23: రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ సీఎంకేసీఆర్‌ హయాంలోనే పల్లెల్లో ప్రగతి జరుగుతుందని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టం చేశారు. ఆదివారంజైనథ్‌ మండలంలోని గూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని నాయకులతో కలిసిప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలు, రోడ్లు, మురికి కాల్వలను నిర్మించామన్నారు. గ్రామంలో ఇప్పటి వరకు రూ.60లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేశామన్నారు. అనంతరం తరోడ గ్రామంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న బాజీరావ్‌ బాబా  సప్తాహం కార్యక్రమానికి హాజరై బాజీరావ్‌ బాబా చిత్రపటానికి పూజలు చేసి పల్లకీ సేవలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎం.గోవర్ధన్‌, వైస్‌ ఎంపీపీ విజయ్‌కుమార్‌, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్‌ ఎస్‌.లింగారెడ్డి, సర్పంచ్‌ ప్రభాకర్‌, ఎంపీటీసీలు రమరమేష్‌, భోజన్న ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పట్టణ అభివృద్ధికి కృషి
మావల: సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ఆదిలాబాద్‌ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదివారం పట్టణంలోని చిల్కూరి లక్ష్మీనగర్‌లో రూ.70లక్షలతో బీటీ రోడ్డు, కల్వర్టుల నిర్మాణానికి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని ఇందిరానగర్‌లోని రూ.15లక్షలతో ఆదివాసీ పర్దాన్‌ సమాజ్‌ సంఘ భవనం నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ మేరకు సంప్రదాయ బద్ధంగా హిరాసుక్క దేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మెట్టు ప్రహ్లాద్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జహీర్‌రంజాని, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు అలాల్‌ అజయ్‌, కౌన్సిలర్‌ నర్సింగ్‌, ఆదివాసీ పర్ధాన్‌ సంఘ జిల్లా అధ్యక్షుడు దుర్వానగేష్‌, డివిజన్‌ అధ్యక్షుడు గోడంగంగారాం, మహిళా అధ్యక్షురాలు దివ్య, నాయకులు జనార్దన్‌, విష్ణు, సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-24T05:04:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising