ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుస్తకాలు, యూనిఫామ్‌లు అమ్ముతున్న ప్రైవేట్‌ బడులను సీజ్‌ చేయాలి

ABN, First Publish Date - 2022-07-02T06:59:25+05:30

ప్రభుత్వం ప్రైవేట్‌ పాఠశాలల్లో నోట్‌ పుస్తకాలు, యూనిఫామ్‌లు అమ్మవద్దని తీసుకువచ్చిన జీవోను దిక్కరించి అమ్మకాలు సాగిస్తున్న ప్రైవేట్‌ పాఠశాలలను వెంటనే సీజ్‌ చేయాలని పీడీఎస్‌యూ నిర్మల్‌ జిల్లా శాఖ డిమాండ్‌ చేసింది.

జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ అర్బన్‌, జూలై 1 : ప్రభుత్వం ప్రైవేట్‌ పాఠశాలల్లో నోట్‌ పుస్తకాలు, యూనిఫామ్‌లు అమ్మవద్దని తీసుకువచ్చిన జీవోను దిక్కరించి అమ్మకాలు సాగిస్తున్న ప్రైవేట్‌ పాఠశాలలను వెంటనే సీజ్‌ చేయాలని పీడీఎస్‌యూ నిర్మల్‌ జిల్లా శాఖ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఆందోళన కార్యక్రమానికి విద్యార్థి సంఘ నేత జిల్లా ప్రధాన కార్యదర్శి మహేందర్‌ వాగ్మారే మాట్లాడు తూ... జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ బడులలో అరకొర వసతులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రైవేట్‌ పాఠశాలలు కార్పొరేట్‌ యాజమాన్య పాఠశాలలు విచ్చలవిడిగా ప్రభుత్వ నిబంధనలను అతి క్రమిస్తున్నాయని విమర్శించారు. పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, యూని ఫామ్‌లు పాఠశాలల్లోనే బహిరంగంగా అమ్ముతున్నప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారి చర్యలు తీసు కోవడం లేదని ఆరోపించారు. అలాగే అదనపు ఫీజులు వసూలు చేస్తూ అడ్డ గోలుగా దోచుకుంటున్నారని విమర్శించారు. వెంటనే అలాంటి పాఠశాలలను గుర్తించి సీజ్‌ చేయాలని లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వెంకటేష్‌, శ్రీనివాస్‌, అజయ్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-02T06:59:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising