ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాణహిత

ABN, First Publish Date - 2022-08-12T04:19:35+05:30

ఎగువ కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది పోటెత్తింది. కోటపల్ల, వేమనపల్లి మండలంలోని సమీప గ్రామాల్లో వేల ఎకరాల పంటలు నీట మునిగాయి. రెండు రోజులుగా వరద ఉధృతి కొనసాగుతుంది. కోటపల్లి మండలంలోని వెంచపల్లి, జనగామ, సూపాక, ఆల్గామ, పుల్లగామ, సిర్సా, ఏదులబంధం, అన్నారం, అర్జునగుట్ట, రాపనపల్లి గ్రామాల్లో సుమారు 3 వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. ఇప్పటికే రెండు సార్లు సాగు చేసిన పత్తి పంట నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

జనగామ వద్ద ముంపునకు గురైన పంటలను పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయాధికారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

కోటపల్లి/వేమనపల్లి, ఆగస్టు 11: ఎగువ కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది పోటెత్తింది. కోటపల్ల, వేమనపల్లి మండలంలోని సమీప గ్రామాల్లో వేల ఎకరాల పంటలు నీట మునిగాయి. రెండు రోజులుగా వరద ఉధృతి కొనసాగుతుంది.  కోటపల్లి మండలంలోని వెంచపల్లి, జనగామ, సూపాక, ఆల్గామ, పుల్లగామ, సిర్సా, ఏదులబంధం, అన్నారం, అర్జునగుట్ట, రాపనపల్లి గ్రామాల్లో సుమారు 3 వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. ఇప్పటికే రెండు సార్లు సాగు చేసిన పత్తి పంట నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.  లక్షల రూపాయల పెట్టుబడులు వృథా అయ్యాయని, పత్తి మొక్కలు పెరిగే అవకాశం లేకుండా పోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.  ప్రాణహిత బ్యాక్‌ వాటర్‌తో వేమనపల్లి నుంచి కల్లెంపల్లికి వెళ్లే మార్గంలో ఉన్న మత్తడి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగు అవతల ఉన్న సుంపుటం, జాజులపేట, ముక్కిడి గూడెం, కల్లెంపల్లి, ఒడ్డుగూడెం గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కల్లెంపల్లి నుంచి ముల్కలపేట వరకు సుమారు వెయ్యి ఎకరాల్లో  పత్తి పంట నీట మునిగింది. 

పరిశీలించిన జిల్లా వ్యవసాయాధికారి 

ప్రాణహిత నీటిలో ముంపునకు గురైన పత్తి చేన్లు, పొలాలను జనగామ వద్ద జిల్లా వ్యవసాయాధికారి కల్పన, ఏఈవో అనూష, సర్పంచు గట్టు లక్ష్మణ్‌గౌడ్‌లు పరిశీలించారు. నాటు పడవలో సుమారు 4 కిలోమీటర్ల మేర నీటిలో ప్రయా ణిస్తూ నష్టపోయిన పంటలను పరిశీలించారు. నీటి ప్రవాహం తగ్గిన తర్వాత చేపట్టాల్సిన చర్యలపై రైతులకు సూచించారు. ముంపు వల్ల జరిగిన నష్టంపై ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. మాజీ సర్పంచు చంద్రయ్య, పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-12T04:19:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising