నెలాఖరులోగా పోడు సర్వే పూర్తిచేయాలి
ABN, First Publish Date - 2022-11-11T22:44:08+05:30
ఆసిఫాబాద్, నవంబరు 11: పోడు భూముల సర్వేను నెలాఖరులోగా పూర్తిచేయాలని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమే ష్‌కుమార్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు, అదనపుకలెక్టర్‌లు, ఎస్పీలు, సంబంధిత శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, నవంబరు 11: పోడు భూముల సర్వేను నెలాఖరులోగా పూర్తిచేయాలని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమే ష్‌కుమార్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు, అదనపుకలెక్టర్‌లు, ఎస్పీలు, సంబంధిత శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నెలాఖరు వరకు పోడు భూముల సర్వే పూర్తి చేసి గ్రామసభ, డివిజన్‌సభ, జిల్లాసభలు పూర్తి చేయాలని తెలిపారు. పోడుభూముల ప్రక్రియ అవకతవకలు జరగకుండా పకడ్బందీగా చేపట్టాలని, ప్రజల సందేహాలు నివృత్తి చేస్తూ శాంతియుత వాతావర ణంలో ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. డిసెంబరు మొదటి వారంలోగా అర్హులైన వారికి ఆర్‌వో ఎఫ్‌ఆర్ పట్టాలు అందించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందన్నారు. కలెక్టర్ రాహుల్‌రాజ్ మాట్లాడుతూ పోడు భూముల పట్టా కొరకు వచ్చిన దరఖాస్తులను అటవీ, రెవెన్యూ శాఖల సమన్వయంతో ఆయా గ్రామ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులను భాగస్వాములను చేస్తూ ఎఫ్‌ఆర్‌సీ కమిటీసభ్యులతో కలిసి పరిశీలి స్తామని తెలిపారు.
Updated Date - 2022-11-11T22:44:09+05:30 IST