ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అటవీ అధికారులను అడ్డుకున్న పోడు రైతులు

ABN, First Publish Date - 2022-06-28T04:37:45+05:30

ఆసిఫాబాద్‌ మండ లంలోని రౌటసంకపల్లి గ్రామంలో సోమవారం పోడు రైతులు అటవీఅధికారులను అడ్డుకున్నారు. రౌటసంకె పల్లి పంచాయతీ పరిధిలోని బొందగూడ, మెంగు బాయిగూడ, అడ్డాఘాట్‌ గ్రామాలకుచెందిన సుమారు 150మంది రైతులు 300ఎకరాల్లో మూడు దశాబ్దాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారు.

అటవీ అధికారులను అడ్డుకుంటున్న గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌రూరల్‌, జూన్‌ 27: ఆసిఫాబాద్‌ మండ లంలోని రౌటసంకపల్లి గ్రామంలో సోమవారం పోడు రైతులు అటవీఅధికారులను అడ్డుకున్నారు. రౌటసంకె పల్లి పంచాయతీ పరిధిలోని బొందగూడ, మెంగు బాయిగూడ, అడ్డాఘాట్‌ గ్రామాలకుచెందిన సుమారు 150మంది రైతులు 300ఎకరాల్లో మూడు దశాబ్దాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారు. వీరికి గతం లోనే అధికారులు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చారు. ఇటీవల ఆభూములను దున్నుకోకుండా అటవీ అధికా రులు అడ్డుపడుతున్నారు. తాజాగా సోమవారం ఆయాగ్రామాల రైతులు తమభూముల్లో దున్నుతుం డగా అటవీఅధికారులు రావడంతో వారిని భూము ల్లోకి రాకుండా అడ్డుకున్నారు. ఒకవేళ తమ భూముల జోలికి వస్తే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుం దని హెచ్చరించారు. ఈ సందర్భంగా పోడు రైతు లకు, అటవీఅధికారులకు కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఉదయం 9గంటల ప్రారంభమైన ఈ నిరసన సాయంత్రం 4వరకు కొనసాగింది. అటవీశాఖాధికారులు వెళ్లి పోవడంతో రైతులు తమ నిరసనను ముగించారు. అంతకుముందు డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు పోడురైతుల వద్దకు వెళ్లి సంఘీ భావం తెలిపారు.

Updated Date - 2022-06-28T04:37:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising